Begin typing your search above and press return to search.

ఎమెల్యే కథలో అవి కూడా ఉంటాయా

By:  Tupaki Desk   |   17 March 2018 9:30 AM GMT
ఎమెల్యే కథలో అవి కూడా ఉంటాయా
X
నిన్న విడుదలైన ఎమెల్యే ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడన్నది నిజం. పటాస్ తర్వాత సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న ఇతన్ని ఇది మళ్ళి లైన్ లో పెడుతుంది అనే నమ్మకం ఫాన్స్ లో కూడా కాస్త గట్టిగానే ఉంది. ఇకపోతే ఇందులో చూపించిన షాట్స్ కాని చెప్పించిన డైలాగ్స్ కాని పొలిటికల్ ఫ్లేవర్ లో ఉండటం ఆసక్తి రేపుతోంది. నిజానికి కళ్యాణ్ రామ్ ది బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబమే అయినా తను స్వయంగా వాటి పట్ల ఎప్పుడు ఆసక్తి చూపలేదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో ఓసారి ఎన్నికల కోసం టిడిపి కోసం భీభత్సమైన ప్రచారం చేసాడు కాని ఇప్పుడు పూర్తిగా దూరం అయ్యాడు. ఇక నాన్న హరికృష్ణ ఒకప్పుడు టిడిపిలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు కాని ఆయన సైతం న్యూట్రల్ గేర్ లో ఉండిపోయి వాటి గురించి మాట్లడ్డం కూడా మానేశారు. ఈ నేపధ్యంలో ఎమ్యెల్యే ట్రైలర్ లోని సన్నివేశాలు - సంభాషణలు ఆసక్తి రేపుతున్నాయి.

పోటీ చేసి గెలవడం కన్నా నాతో పోటీకే భయపడుతున్నారు అంటే అదే నాకు పెద్ద గెలుపన్నయ్య అనే డైలాగ్ తో పాటు నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు-చేయడం మొదలుపెడితే మీకు ఏమి మిగలదు అని చెప్పడం చూస్తుంటే ఇందులో బలమైన కాన్వాస్ ఏదో దర్శకుడు ఉపేంద్ర మాధవ్ సెట్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ ని ఉద్దేశించి ఒక పాత్ర మీ వెనుక జనం ఉన్నట్టు లేరే అని అడిగించడం కూడా బహుశా నాన్న హరికృష్ణ రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా ఎన్టీఆర్ బిడ్డగా ప్రజల్లో ఆదరణ మెండుగా ఉంది అని చెప్పించడానికే అనే కోణంలో కూడా అభిమానులు విశ్లేషణ చేస్తున్నారు. మొత్తానికి చిన్న ట్రైలర్ తో ఎమెల్యే పెద్ద ఆసక్తే రేపుతున్నాడు. రవి కిషన్ మెయిన్ విలన్ గా నటించిన ఈ మూవీలో కాజల్ మొదటి సారి జట్టు కట్టిన సంగతి తెలిసిందే.

సో ఈ డైలాగ్స్ ని బట్టి ఇందులో వర్తమాన రాజకీయాలకు సంబంధించి కౌంటర్లు, పంచు డైలాగులు ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది కనక హిట్ కొడితే కళ్యాణ్ రామ్ మళ్ళి ట్రాక్ లో పడ్డట్టే. దీనితో పాటు సమాంతరంగా పూర్తి చేసిన నా నువ్వే మే మూడో వారంలో విడుదల కానుంది. రెండు నెలల షార్ట్ గ్యాప్ లో రెండు సినిమాలతో వస్తున్న కళ్యాణ్ రామ్ బండి మళ్ళి గాడిలో పడుతుందేమో చూడాలి.