ఫాంటసీ జానర్ తో నందమూరి హీరో

Fri Mar 22 2019 09:51:48 GMT+0530 (IST)

గత రెండు మూడేళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కు 118 కొంత ఊరట కలిగించింది. మరీ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ కాదు కాని తన రేంజ్ కు తగ్గట్టు మార్కెట్ బాగా డౌన్ లో ఉన్న సమయంలో ఇది సేఫ్ వెంచర్ గా నిలవడం అభిమానులకు సైతం సంతోషం కలిగించేదే. ఇదిలా ఉండగా తాత పేరు మీద నెలకొల్పిన బ్యానర్ లో ముందు నుంచి సినిమాలు తీయడం అలవాటున్న కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడట. త్వరలో ఫాంటసీ జానర్ లో ఓ వెరైటీ సబ్జెక్టు చేయబోతున్నట్టు టాక్. వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడితో ఈ ప్రయోగం చేస్తారట. కథ బాగా నచ్చిందని అయితే ఫైనల్ వెర్షన్ విన్నాక ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిసింది.  దీని కన్నా ముందు కళ్యాణ్ రామ్ వైశాఖ్ అనే మరో డెబ్యు డైరెక్టర్ కు కమిట్ అయ్యాడు. ఇది కూడా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. రెగ్యులర్ కథలను కాకుండా కాస్త విభిన్నతకు పెద్ద పీట వేసేలా కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నాడట.

118 ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇదే రూట్ లో కొనసాగుతూనే మంచి మాస్ సబ్జెక్టు దొరికితే అది కూడా ప్రయత్నించే దిశగా ప్లానింగ్ చేసుకుంటున్నట్టు తెలిసింది. 118 బాగా నేమ్మదించినప్పటికీ మెయిన్ సెంటర్స్ లో వీకెండ్ రన్ బాగానే సాగుతోంది. ఏప్రిల్ 5 మజిలి వచ్చే దాకా మధ్యలో ఏ సినిమా ఆకట్టుకునేలా లేకపోవడంతో వర్క్ అవుట్ అవుతోంది. ఈ రెండు కొత్త సినిమాల వివరాలు మాత్రం అతి త్వరలో తెలుస్తాయి