Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   4 Oct 2015 1:30 PM GMT
హ్యాట్రిక్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్
X
‘పటాస్’ సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం అతను మల్లికార్జున్ దర్శకత్వంలో ‘షేర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోనే సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. ‘షేర్’ తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే తర్వాతి సినిమా కూడా కన్ఫమ్ అయిపోయింది.

రైటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. దర్శకుడిగా మారి బిందాస్ - రగడ - దూసుకెళ్తా సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న వీరూ పోట్ల దర్శకత్వంలో నటించబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత బేనర్ లో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.

‘దూసుకెళ్తా’ హిట్టయినప్పటికీ తన తర్వాతి సినిమా విషయంలో బాగా గ్యాప్ తీసుకున్నాడు వీరూ పోట్ల. రవితేజ, వెంకటేష్ ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా సినిమా అన్నారు. అదీ పట్టాలెక్కలేదు. చివరికి కళ్యాణ్ రామ్ తో సినిమా ఓకే అయింది.