Begin typing your search above and press return to search.

మెసేజ్ అంటే ఆడియన్స్ కి హింసే

By:  Tupaki Desk   |   21 March 2018 11:30 PM GMT
మెసేజ్ అంటే ఆడియన్స్ కి హింసే
X
సినిమా అంటేనే వినోద సాధనం. ప్రేక్షకులు తమ సమయాన్ని కాసింత సరదాగా గడిపేందుకు.. అంతో ఇంతో వినోదాన్ని ఆస్వాదించేందుకు ఎక్కువగా థియేటర్ల బాట పడుతుంటారు. అఫ్ కోర్స్.. అప్పుడప్పుడూ విషాద చిత్రాలు.. సందేశాత్మక చిత్రాలు కూడా ఆకట్టుకుంటాయి. కానీ వింటున్నారు కదా అనీ అదే పనిగా మెసేజ్ లు ఇస్తే మాత్రం.. వారికి ఎక్కకపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చాలా సార్లు ప్రూవ్ అయింది.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా ఎమ్మెల్యే చిత్రం రూపొందింది.. ఈ నెల 23న థియేటర్లలోకి వస్తోంది. ఇది రాజకీయాలతో ముడిపడిన సినిమా అయినా సరే.. వినోదాత్మకంగానే తెరకెక్కించామని చెబుతున్నాడు నందమూరి హీరో. మూవీలో పాలిటిక్స్ ప్రస్తావన ఉన్నా ఎవరినీ టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే కథకు లోబడి మాత్రమే సినిమా ఉంటుందని చెప్పిన కళ్యాణ్ రామ్.. తమ దగ్గర ఓ సీరియస్ పాయింట్ ఉన్నంత మాత్రాన.. ఆ సీరియస్ నెస్ ని ప్రేక్షకుల నెత్తిపై రుద్దాలనే ప్రయత్నం చేయడం సరికాదని.. అందుకు తానే నటించి నిర్మించిన ఓం చిత్రమే నిదర్శనం అని అన్నాడు కళ్యాణ్ రామ్.

మెసేజ్ ల పేరుతో ఆడియన్స్ ని హింసించడం ఎంతమాత్రం తగదన్న ఈ నందమూరి హీరో.. ప్రేక్షకులు రకరకాల సమస్యల నుంచి కాసింత ఆటవిడుపు కోసం థియేటర్లకు వస్తే.. వారికి సందేశాలు ఇచ్చి విసిగించకూడదని.. ఏదైనా పాయింట్ చెప్పదలచుకుంటే.. దాన్ని సుతిమెత్తగానే చెప్పాలని అంటున్నాడు. మరి కళ్యాణ్ రామ్ అంటే ప్రొడ్యూసర్ కం హీరో కదా.. ఆడియన్స్ పల్స్ ను ఆమాత్రం పట్టుకోవడంలో ఆశ్చర్యం లేదులే.