Begin typing your search above and press return to search.

చరణ్-సుక్కు అంటే భయం లేదేంటి?

By:  Tupaki Desk   |   20 Jan 2018 12:03 PM GMT
చరణ్-సుక్కు అంటే భయం లేదేంటి?
X
రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం’. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఆన్ లొకేషన్ ఫొటోలు ఆసక్తి రేకెత్తించాయి. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజయ్యే టీజర్ చూశాక ఈ అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి సినిమాకు పోటీగా మరో చిత్రం రిలీజ్ చేయాలంటే భయపడాల్సిందే. కానీ ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ మార్చి 30 అని కన్ఫమ్ అయ్యాక కూడా ఒకటికి రెండు మీడియం రేంజి సినిమాలు అదే వారాంతానికి షెడ్యూల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘మహానటి’ని మార్చి 29న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మధ్యే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎంఎల్ ఏ’ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘రంగస్థలం’ సంగతి తెలిసి కూడా ఇలా ఒకటికి రెండు మీడియం సినిమాలు పోటీగా రిలీజ్ డేట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ మధ్య మంచి సీజన్లలో వస్తున్న పెద్ద సినిమాలేవీ కూడా అంచనాల్ని అందుకోవట్లేదు. దసరాకు ‘స్పైడర్’.. సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ బోల్తా కొట్టేశాయి. ఇది చూసుకునే ‘రంగస్థలం’కు పోటీగా తమ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యారా లేక ఇలా పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ డేట్ ఇస్తే మంచి ప్రచారం దక్కుతుందని భావిస్తున్నారా? వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం మార్చి నెలాఖర్లో ఒకేసారి మూడు సినిమాల్ని రిలీజ్ చేయడమైతే కష్టమేనేమో.