కళ్యాణ్.. వాటే హాట్ పోస్టర్

Wed Jun 13 2018 16:52:20 GMT+0530 (IST)

టాలీవుడ్ లో మాస్ హీరోల సంఖ్య చాలా పెద్దదిగానే ఉంది. అందులో కొంత మంది హీరోలు ఇంతవరకు క్లాస్ లుక్ తో కనిపించలేదు. కొందరు ఆ ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు. పూర్తిగా క్లాస్ లుక్ కాకుండా సినిమాలో మాస్ అనే రెండు అంశాలు ఉండేట్లు చూసుకున్న హీరోలు అయితే బాగా సక్సెస్ అయ్యారు. ఆ విషయం పక్కపెడితే కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.పూర్తిగా క్లాస్ లుక్ కనిపించడం ఒక ఎత్తైతే.. మాస్ కథలతో మంచి గుర్తింపు తెచ్చుకొని పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ ను ఒప్పుకోవడం మరొక ఎత్తు. ఇక ఇవన్నీ కాకుండా  సినిమాలో రొమాన్స్ సీన్స్ లో గట్టిగా నటించడం అనేది మరో షాకింగ్ విషయం. నా నువ్వే సినిమాలో కళ్యాణ్ రామ్ నిజంగా కొత్తగా కనిపిస్తున్నాడని చెప్పడంతో పాటు.. అవకాశం వస్తే ఎలాంటి సినిమాలకు అయినా తాను సెట్ అవుతాను అని చెప్పకనే చెప్పేశాడు. ఇప్పటికే పోస్టర్స్ తో ట్రైలర్స్ తో షాక్ ఇచ్చిన హీరో రిలీజ్ టైమ్ లో వేడిని మరింత పెంచాడు.

మరో పోస్టర్ తో అభిమానులకు కిక్కు ఇచ్చాడు. పైన కనిపిస్తున్న ఫోటో నిజంగా ఎంత హాట్ గా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమన్నా పేదల కు కింద ముద్దు పెట్టాలని ట్రై చేస్తున్నట్లు ఉన్న ఫొటో రొమాంటిక్ మూడ్ ని కలిగిస్తోంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా కూడా తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరి రేపు విడుదల కానున్న నా నువ్వే సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.