Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: 1.18 కు ఏం జరిగింది.?

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:50 AM GMT
టీజర్ టాక్: 1.18 కు ఏం జరిగింది.?
X
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేద థామస్.. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం '118'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.

49 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో సినిమా స్టొరీని రివీల్ చేయకపోయినా థ్రిల్లర్ స్టొరీ అనే విషయం మాత్రం హింట్ ఇచ్చారు. సాఫీగా సాగిపోతున్న కళ్యాణ్ రామ్ - షాలినిల జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది. షాలిని గాయలపాలవడం.. కళ్యాణ్ రామ్ టెన్షన్ లో ఉండడం.. ఏదో మిస్టరీని ఛేదించే ప్రయత్నాలలో ఉన్నట్టు గా చూపించారు. కళ్యాణ్ రామ్ కు తోడుగా ప్రభాస్ శీను కూడా కనిపించాడు. జరిగిన సంఘటనకు 1.18 సమయానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా చూపించారు. మొత్తం ట్రైలర్లో ఎక్కడా నివేదా థామస్ ను మాత్రం చూపించలేదు.

కళ్యాణ్ రామ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. కళ్యాణ్ - షాలినిల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. కేవీ గుహన్ సినిమాటోగ్రఫి.. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. ఒకసారి మీరు కళ్యాణ్ రామ్ జీవితం లో ఏం జరిగిందనే శాంపిల్ చూడండి.