కొత్త పోస్టర్ తో కళ్యాణ్ రామ్ సంక్రాంతి విషెస్

Tue Jan 15 2019 14:58:54 GMT+0530 (IST)

తెలుగువారికి ఉన్న ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ఒకటి.  అందుకే సంక్రాంతి వచ్చిందటే చాలు అందరిలోగిళ్ళలో ఎంతో సందడి నెలకొంటుంది. ఇక టాలీవుడ్ కు సంబంధించిన సెలబ్రిటీలు కూడా సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.  ప్రేక్షకులకు శుభాకంక్షలు తెలుపుతారు.  సంక్రాంతి సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అందరికీ సంక్రాంతి విషెస్ చెప్పాడు.తన ట్విట్టర్ ఖాతా ద్వారా "మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ పూట మీ ఇంట సిరి సంపదలు సుఖ సంతోషాలు విలసిల్లాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేస్తూ తన తాజా చిత్రం '118' పోస్టర్ ను షేర్ చేశాడు.  పోస్టర్ లో సినిమా మార్చ్ 1 న రిలీజ్ అవుతుందని కూడా కన్ఫాం చేశారు.  ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ స్టైల్ గా కూర్చొని ఏదో అలోచనలో ఉన్నట్టుగా పోజ్ ఇచ్చాడు.  

థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న '118' లో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేద థామస్.. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  దర్శకుడు కేవీ గుహన్. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కు మరి ఈ సినిమాతో అయినా విజయం లభిస్తుందేమో వేచి చూడాలి.