Begin typing your search above and press return to search.

ఫైనల్ కాల్ ఇవ్వడానికి నాగ్ రెడీ

By:  Tupaki Desk   |   11 Jun 2018 5:17 PM GMT
ఫైనల్ కాల్ ఇవ్వడానికి నాగ్ రెడీ
X
అక్కినేని హీరోలు కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలమవుతోంది. కోడలు పిల్ల చక చక సినిమాలు చేయడమే కాకుండా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేస్తోంది. ఇక నాగ్ అయితే ఓ వైపు కొడుకుల సినిమాలు చేసుకోవాలా మరో వైపు తన సినిమాలు చేసుకోవాలా అనే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆఫీసర్ సినిమా ఊహించని పరాజయాన్ని అందించింది.

ఇక ప్రస్తుతం నాగార్జున చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. నానితో తో చేస్తున్న మల్టీస్టారర్ పై ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మలయాళం మోహన్ లాల్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేయనున్నారు. ఇక కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు అయితే కొన్ని నెలల నుంచి ప్రోగ్రెస్ లో ఉంది. నాగ్ ఎటు తేల్చుకోలేక పెండింగ్ లో పెడుతూ వచ్చారు. ఇక లాభం లేదని ఫైనల్ కాల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.

కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జునకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక దానికి సీక్వెల్ ను రెడీ చేసుకున్న కళ్యాణ్ తో నాగ్ చేస్తాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కళ్యాణ్ కృష్ణ రవితేజతో నేల టిక్కెట్టు తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇక కళ్యాణ్ తో రీమేక్ కథ అయినా సరే తెరకెక్కించే ప్లాన్ లో నాగ్ ఉన్నట్లు టాక్.