ఇప్పుడు ఏమంటావ్ కళ్యాణ్ బాబు?

Wed Jun 13 2018 15:29:53 GMT+0530 (IST)

కాకి పిల్ల కాకి కి ముద్దు అన్నట్టు ఎవడి సినిమాకు వాడే హీరో.. ప్రతి ఒక్కరు వారు తెరకెక్కించిన సినిమా పై పొగడకుండా ఉండరు. అందరు కష్టపడే సినిమా తీస్తారు. కానీ జనాలు ఆదరిస్తేనే ఆ సినిమా హిట్ అయినట్టు. ముఖ్యంగా ఖర్చు పెట్టిన బడ్జెట్ లో ఒక రూపాయి నష్టపోకుండా ఉన్నా కూడా సినిమా హిట్ అయ్యిందని చెప్పవచ్చు. కానీ ఒక్క రూపాయి కూడా లాభం రాబట్టకపోయినా కూడా కొందరు వారి సినిమాను హిట్ అనేస్తారు.మరికొందరైతే ఇతరుల మీద నిందలు వేయడం సర్వసాధారణం. గతంలోఎప్పుడు లేని విదంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్రిటిక్స్ కు సినిమా చూడటం రాదు అనేశాడు. నేల టిక్కెట్టు సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ ను అందుకుంది. అమ్ముడుపోయిన రేట్ లో కనీసం సగం డబ్బును కూడా లాగలేకపోయింది. సినిమాలో కొత్తదనం ఏమి లేకపోవడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదని కలెక్షన్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. త్రియేటికల్ రైట్స్ 22 కోట్లు పలికిన నేల టికెట్టు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

నేల టిక్కెట్టు షేర్స్ 9.85 కోట్లను మాత్రమే అందుకోవడం గమనార్హం. గ్రాస్ పరంగా 20.1 కోట్లను అందుకుంది. షేర్స్ లాభాలు రాకపోవడంతో 44.8% మాత్రమే రికవర్ చేసుకోగలిగారు. దీంతో సినిమా డబుల్ డిజాస్టర్ అనిపించుకుంది. కానీ దర్శకుడు మాత్రం జనాలకు సినిమా బాగా నచ్చిందని - నచ్చలేదు అని చెప్పిన వాళ్లకు సినిమా చూడటం రాదనీ చెప్పడంతో ఈ కలెక్షన్స్ చూసిన తరువాత ఏమంటావ్ కళ్యాణ్ బాబు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. మరి దీనికి ఏమంటారు కళ్యాణ్ బాబు?