Begin typing your search above and press return to search.

సోగ్గాడి దర్శకుడు ఆ కాంపౌండ్ దాటి రాడా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:30 PM GMT
సోగ్గాడి దర్శకుడు ఆ కాంపౌండ్ దాటి రాడా?
X
సోగ్గాడే చిన్నినాయనా షూటింగ్ జరుగుతున్నన్నాళ్లూ ఆ సినిమా మీద నెగెటివ్ ప్రచారమే జరిగింది. కొత్త దర్శకుడు సినిమాను సరిగా డీల్ చేయలేకపోతున్నాడట.. రెండుమూడుసార్లు రీషూట్లు చేశారట.. అంటూ రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఐతే రీషూట్లు చేసి తప్పులు దిద్దుకుంటే తప్పేంటి అని లాజికల్ గా క్వశ్చన్ అడిగిన నాగ్ అందరి నోళ్లూ మూయించాడు. ఇక సినిమా థియేటర్లలోకి వచ్చాక సినిమా గురించి చెత్త ప్రచారం చేసిన వాళ్లందరూ షటప్ అయిపోయారు. మొత్తానికి టాలీవుడ్ లోకి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఎంట్రీ అద్భుతంగా జరిగిపోయింది. ఇప్పుడిక కళ్యాణ్ రెండో సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

కళ్యాణ్ రెండో సినిమా గురించి ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. నాగార్జునతోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’కు కొనసాగింపుగా ‘బంగార్రాజు’ అనే మూవీ చేస్తాడని.. కాదు అఖిల్ తో మూవీ ఉండొచ్చని.. ఊహాగానాలు వినిపించాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్.. నాగచైతన్యతో తన తర్వాతి సినిమా చేస్తాడట. ఇప్పటికే దీనికి సంబంధించి కథాచర్చలు పూర్తయ్యాయట. ప్రాజెక్టు ఓకే అయిపోయిందట. కళ్యాణ్ ఇక స్క్రిప్టు పనిలో నిమగ్నమైపోయాడట. ఇంకో రెండు మూడు నెలల్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ఇప్పుడు చైతూతో చేయబోతున్న కళ్యాణ్.. తర్వాత నాగ్, అఖిల్ లతో కూడా సినిమాలు చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం.