మెగా సెంటిమెంట్ ను అల్లుడు బ్రేక్ చేస్తాడా?

Wed Jun 13 2018 13:12:43 GMT+0530 (IST)

మెగాస్టార్ వారసులుగా చాలామందే ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో దాదాపుగా అందరూ టాలీవుడ్ హీరోలుగా కుదురుకుపోయారు. ఇకపై రాబోయే హీరోలు కూడా చాలామందే ఉంటారు. అయితే.. త్వరలో విజేత అంటూ వస్తున్నాడు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ జనాలను బాగానే ఆకట్టుకుంది.తండ్రి-కొడుకుల సెంటిమెంట్ ను బాగానే రంగరించారని అర్ధం అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగానే ఆకట్టుకున్నాడు కళ్యాణ్ దేవ్. అయితే.. తన తొలి సినిమాతో మెగా అల్లుడు హిట్టు కొడతాడా లేదా అన్నదే పాయింట్. ఎందుకంటే.. ఇప్పటివరకూ మెగాస్టార్ వారసుల్లో అధికశాతం తమ రెండో సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కంటే రెండో సినిమా గోకులంలో సీత బాగా ఆడింది.. పేరు తెచ్చింది. రామ్ చరణ్ మూవీ చిరుత యావరేజ్ కాగా.. రెండో చిత్రం మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత వరుణ్ తేజ్ కు తొలి చిత్రం ముకుంద కాకుండా తర్వాత వచ్చిన కంచె హిట్ ను అందించింది.అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం గంగోత్రి హిట్ అయినా.. కెరీర్ కుదురుకుంది మాత్రం ఆర్యతోనే. మరి ఈ అందరికీ రెండో సినిమా అచ్చొచ్చింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి సినిమా అచ్చిరాదనే సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.