చరణ్ బావ ఏమీ చెప్పలేదట!

Thu Jul 12 2018 13:27:27 GMT+0530 (IST)

చిరు కుటుంబం నుంచి తెరపైకొచ్చిన మరో వారసుడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్నల్లుడైన కళ్యాణ్ ఈ రోజే విడుదలైన `విజేత`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తక్కువ హైప్ తోనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీతోనే జనాల్లోకి వెళుతుందనే ఓ నమ్మకంతో నిర్మాణ సంస్థ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి ఈ సినిమాకి నిర్మాత కాగా - రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.  ఈ సినిమా ప్రమోషన్లలో కళ్యాణ్ దేవ్ కాన్ఫిడెంట్ గానే కనిపించాడు. మీడియా అడిగిన  ప్రశ్నలకి  ఉన్నదున్నట్టుగా  చకచకా సమాధానాలు చెప్పాడు.మీ ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నారు కదా ఎలాంటి సలహాలు లభించాయన్న ప్రశ్నకి ఆయన ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. సినిమాకి ముందు చరణ్ బావ నాకెలాంటి సలహాలు ఇవ్వలేదన్నాడు. కాకపోతే సినిమా తర్వాత ఆయన ప్రమోషన్ విషయంలో చాలా సూచనలు ఇచ్చాడని చెప్పాడు. టీజర్ విడుదలైన వెంటనే బాగుందని విష్ కూడా చేసినట్టు వెల్లడించారు. చిరంజీవి మాత్రం కథ వినడం మొదలుకొని... రషెష్ చూడటం వరకు దగ్గరుండి సినిమాని పరిశీలించాడట. అయితే ఫైనల్ వర్షన్ మాత్రం మావయ్య చూడలేదని త్వరలోనే ఆయనకి సినిమా చూపించబోతున్నామని తెలిపారు.  తన భార్య శ్రీజకి మాత్రం సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు కళ్యాణ్. శ్రీజ మూవీ లవర్ కాదన్న విషయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు కళ్యాణ్.