మెగా అల్లుడు అప్పుడే ఆ పని చేస్తున్నాడే

Thu May 17 2018 13:39:45 GMT+0530 (IST)

టాలీవుడ్లో పెద్ద కుటుంబం అంటే మెగాస్టార్ చిరంజీవిదే. మెగా కుటుంబం నుంచి ఇప్పటికే అరడజనుకి పైగా హీరోలొచ్చినా... మళ్లీ ఇంకో హీరో వస్తున్నాడంటే మెగా అభిమానుల్లో కలిగే ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అవుతున్న విషయం తెలిసిందే.ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబుతో ‘జత కలిసే’ సినిమాను తీసిన రాకేష్ శశి దర్శకత్వంలో తన తొలి సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇప్పటికే రెగ్యూలర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. సింగిల్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. దాంతో డబ్బింగ్ పనులను మొదలెట్టింది చిత్ర బృందం. కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోని రీసెంటుగా మీడియాకి విడుదల చేశారు. మంచి కలర్ తో మెరిసిపోతున్న కళ్యాణ్ ఫుల్లు ఎనర్జీతో డబ్బింగ్ చెబుతున్నట్టు ఫోటో చూస్తే తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్... కళ్యాణ్ డిబెట్ మూవీకి పనిచేస్తున్నాడు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కళ్యాణ్ దేవ్ సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’- ‘కళ్యాణ వైభోగమే’ ఫేం మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.