ఫస్ట్ లుక్ : హ్యాపీ న్యూ ఇయర్ 1983

Tue Jan 01 2019 17:35:09 GMT+0530 (IST)

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ ను దక్కించుకున్నారు. ఆ సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తో మళ్లీ వరుసగా హీరోగా సినిమాలు చేసేందుకు ఉత్సాహంతో ముందడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ‘కల్కి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 1983 నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. పీరియాడిక్ చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా ‘కల్కి’ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ లో రాజశేఖర్ ‘గరుడవేగ’ చిత్రంలో ఎలా అయితే కనిపించాడో అలాగే ఉన్నాడు. రాజశేఖర్ లుక్ లో మాత్రం పెద్ద తేడా కనిపించడం లేదు. ఆయన పాత్ర మరియు బాడీ లాంగ్వేజ్ లో దర్శకుడు భిన్నత్వం చూపిస్తాడేమో చూడాలి.

ఇక పోస్టర్ లో హ్యాపీ న్యూ ఇయర్ 1983 అంటూ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘అ!’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభను చూపించబోతున్నాడట. వాల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రివీల్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై ఆసక్తిని పెంచారు. సమ్మర్ తర్వాత ఈ చిత్రం విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.