Begin typing your search above and press return to search.

నగ్నత్వాన్ని ప్రేమిస్తున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   18 Aug 2017 11:48 AM GMT
నగ్నత్వాన్ని ప్రేమిస్తున్న హీరోయిన్
X
ఇప్పుడు నగ్నత్వం అనేది ఒక యునివర్సల్ టాపిక్. ఎందుకంటే చాలామంది స్టార్ హీరోయిన్ల నుండి టాప్ మోడల్స్ వరకు.. అందరూ ఇప్పుడు న్యూడ్ ఫోటో షూట్లపైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యనే దీపిక పదుకొనె వంటి స్టార్ కూడా దాదాపు న్యూడ్ అంటున్నట్లు ఫోజులిచ్చింది. కొంతమంది బేర్ బ్యాక్ కొంతమంది టాప్ లెస్.. ఇలా సందడి చేస్తూనే ఉంటారు.

నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఇప్పుడు అలాంటి గ్రూపులోకే దూకేసింది హీరోయిన్ కల్కి కొచెలిన్. ఆ మద్యన ప్రయోగాత్మక సినిమాల్లో కనిపించిన ఈ భామ.. అసలు ముందులోనూ సినిమాల్లో తన హాట్ లుక్కులతో చంపేసింది. ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి నగ్నంగా ఫోటోలు దిగడం మొదలెట్టేసింది. పైగా వాటిని ఎంజాయ్ చేస్తోందట. ఈ నగ్నత్వాన్ని ఆస్వాదిస్తున్నాను.. చాలా బాగుంది.. అంటూ చెబుతోంది అమ్మడు. ఎవరికివారు తమ బాడీని ఇలాగే ప్రేమించుకోవాలనేదే ఈమె కాన్సెప్ట్ కాబోలు.

గతంలో దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ను పెళ్ళి చేసుకుని సినిమా ఇండస్ర్టీలో బిజీగా ఉన్న ఈ భామ.. ఆ దర్శకుడితో డైవర్స్ తీసుకున్నాక మాత్రం కాస్త ఖాళీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ లేదా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులను తప్పిస్తే ఇతర సినిమాలను ఓకె చేయట్లేదు.