Begin typing your search above and press return to search.

వీడియో టాక్: అబ్బా.. కత్తిలాంటి మెలికలు

By:  Tupaki Desk   |   27 July 2016 6:05 AM GMT
వీడియో టాక్: అబ్బా.. కత్తిలాంటి మెలికలు
X
డ్యాన్స్ చేయడంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు? ఇప్పటికే బ్యూటీ కత్రినాకైఫ్ చాలాసార్లు తనే బెస్ట్ అని ప్రూవ్ చేసేసుకుంది. ఇంకా కేట్ మీద ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే.. వాటిని కూడా తీర్చేసేస్తోంది. బార్ బార్ దేఖో అంటూ సిద్ధార్ధ మల్హోత్రాతో కలిసి ఓ మూవీ చేస్తోంది కేట్. ఈ సినిమాలో 'కాలా చెష్మా' సాంగ్ కోసం కొన్ని రోజులుగా బాగా హైప్ క్రియేట్ చేశారు.

ఒక పాట కోసం ఓ సినిమా రిలీజ్ చేసినంత హడావిడి ఎందుకా అనే డౌట్ చాలామందికి వచ్చింది కానీ.. ఆప్పుడా పాటను రిలీజ్ చేసింది యూనిట్. ట్యూన్ ఆకట్టుకోవడం.. సెట్స్ బాగుండడం.. థీమ్ బాగుండడం.. ఇలాంటివన్నీ చాలా సినిమాల్లో చాలా పాటల్లో చూసే ఉంటాం. కానీ ఈ కాలా చెష్మాకి స్పెషల్ అట్రాక్షన్ అంటే మాత్రం.. కత్రినా ఒక్కతే. కత్తిలా డ్యాన్స్ కుమ్మేసింది అనే మాట చాలా చిన్నది. కత్తిని మెలికలు తిప్పితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో మెలికలు తిరిగిపోయింది కత్రినా.

ముఖ్యంగా నాభి కిందకి కట్టుతో.. బెల్లీ డ్యాన్స్ చేస్తుంటే.. బార్ బార్ దేఖో అని చెబుతున్నట్లుగానే ఉంది. కాలా చెష్మా సాంగ్ లో కత్రినా అందాల కంటే.. ఆమె చేసిన డ్యాన్సే అద్భుతంగా ఉందంటే.. ఏరేంజ్ లో డ్యాన్స్ ఇరగదీసేసిందో అర్ధమవుతుంది. మొత్తానికి కత్రినా కత్తిలా మెలికలు తిరిగిపోయింది.