Begin typing your search above and press return to search.

కాజోల్‌ లో మెరుపు తగ్గలేదింకా

By:  Tupaki Desk   |   4 Aug 2015 7:37 PM GMT
కాజోల్‌ లో మెరుపు తగ్గలేదింకా
X
వెన్నెలవే వెన్నెలవే ననే తాకి వచ్చావే.. అంటూ కాజోల్‌ అందాన్ని వర్ణించాడో లిరిసిస్ట్‌. ప్రభుదేవా అద్భుతంగా నృత్యమాడి ప్రేయసిని పోయెటిక్‌ వేలో పడేయాలని చూశాడు. ఆ పాట ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంటుంది.

ఊహల్లో పడితే ఆ కొండ కోన హాయే .. కు కుకూ .. అంటూ మెరుపుకలలు కురిపించిన కాజోల్‌ ని అంత తేలిగ్గా ఆడియెన్‌ మర్చిపోలేరు. బాలీవుడ్‌ లో అరుదైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది కాజోల్‌. కొన్ని సంవత్సరాల పాటు ఒకే థియేటర్‌ లో షోలు ప్రదర్శింపబడిన చిత్రంగా దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రం పేరు తెచ్చుకుంది. చరిత్ర సృష్టించిన ఈ సినిమా నాయికగా కాజోల్‌ ఖ్యాతి ప్రపంచ సినీ యవనికపై సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది.

అంతటి గొప్ప నటి యాక్షన్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ ని పెళ్లాడి, ఇప్పుడు బిడ్డ తల్లిగా ఆలనా పాలనా, సంసారం అంటూ బిజీలో పడిపోయింది. అయినా ఇంకా ఆ ఛార్మ్‌ తగ్గనేలేదనడానికి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. మిడ్డీలో మిసమిసలు ఈ మిసెస్‌ అందాన్ని రెట్టింపు చేశాయి. నునుపైన దేహశిరుల్లో అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందనిపిస్తోంది కదూ! క్రీగంటి చూపుతో కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది కదూ?