సౌందర్య పెళ్లిలో కాజోల్ సందడి

Tue Feb 12 2019 12:34:43 GMT+0530 (IST)

రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహ మహోత్సవం ఇటీవలే చెన్నయ్ లీలా మహల్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మా బిజినెస్ మేన్ .. నటుడు విషగన్ వనంగమూడిని సౌందర్య రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి  వేడుకకు సంబంధించిన ఫోటోలు - వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో రజనీ అభిమానులు ఇప్పటికే వైరల్ చేశారు.తాజాగా వెడ్డింగ్ అనంతరం రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ రిసెప్షన్ లో పలువురు సినీరాజకీయ రంగ ప్రముఖులు - పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. అయితే రిసెప్షన్ ఆద్యంతం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సతీమణి - స్టార్ హీరోయిన్ కాజోల్ సందడే హైలైట్ అయ్యిందిట. ఈ వేడుక ఆద్యంతం కలియతిరిగేస్తూ కాజోల్ ఎంతో సందడి చేశారని ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ధనుష్ నటించిన `వీఐపీ 2`లో కాజోల్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రజనీ- ధనుష్ ఫ్యామిలీకి కాజోల్ మరింత సన్నిహితురాలు అయ్యారు. రిసెప్షన్ లో సౌందర్య తో కలిసి దిగిన ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇకపోతే ధనుష్ ఇప్పటికే అటు బాలీవుడ్ - హాలీవుడ్ రేంజులో అద్భుతమైన కమ్యూనికేషన్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ధనుష్ స్వయంగా ఆహ్వానిస్తేనే కాజల్ ఈ వేడుకకు విచ్చేశారని అర్థమవుతోంది.

ఈ రిసెప్షన్ లో ధనుష్ తో పాటు రజనీ కుటుంబ సభ్యులు సహా పలువురు అతిధులు సందడి చేశారు. అయితే టాలీవుడ్ నుంచి గెస్టులు ఎవరెవరు అటెండ్ అయ్యారు? అన్నది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. సౌందర్య రజనీకాంత్ ఇదివరకూ బిజినెస్ మేన్ ఆర్.అశ్విన్ ని పెళ్లాడారు. కొన్నేళ్ల పాటు సాగిన కాపురంలో కలతల అనంతరం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక సౌందర్య  రజనీకాంత్- విషగన్ వనంగమూడి జంట ఇప్పటికే మిస్టర్ & మిసెస్ గా కొత్త గోల్స్ పెట్టుకుని సవ్యమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ జంట అతిధులు - పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.