Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తప్పుల్ని చూసిన నవ్వుకోండి

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:31 PM GMT
ఫోటో స్టోరి: తప్పుల్ని చూసిన నవ్వుకోండి
X
అమ్మడు కాజల్ అగర్వాల్ ఉంది చూశారూ.. ఇక ఖైదీ నెం 150తో ఆమెకు ఎంత పేరొచ్చింది అనే సంగతి పక్కనెడితే.. పాపకు ఈ దెబ్బతో చాన్నాళ్ల నుండి మొహం చాటేస్తున్న ఆ హిట్టు సినిమా ఒకటి ఒడిలో వచ్చి పడింది. అందుకేనేమో ఇప్పుడు అమ్మడు ''తప్పుల్ని చూసి నవ్వుకోండి'' అంటూ కామెడీ స్టేట్మంట్లను చాలా హాటుగా ఇస్తోంది.

బ్లష్‌ ఎట్ యువర్ ఫాల్ట్స్ అంటూ చందమామ కాజల్ ఈ ఫోటోను షేర్ చేసింది. అసలు ఏ తప్పుకు నవ్వుకోవాలో లేకపోతే ఈ ఫోటోలో ఏదైనా గ్లామరస్ తప్పుందేమో మనకు మాత్రం తెలియదు. కాకపోతే అమ్మడు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా సెక్సీగా ఫోటో షూట్లకు ఫోజులు ఇచ్చేస్తోందని ఈ ఫోటోలను చూస్తే మనకు అర్దమైపోతుంది. ఈ సెక్సీ తప్పులను ఎవరు నవ్వుకుంటారు చెప్పండి.. కావాలంటే కర్పూర వీణలా కరిగిపోతారులే.

ఇకపోతే కాజల్ ప్రస్తుతం రానా దగ్గుబాటితో చేస్తున్న సినిమా కూడా హిట్టయితే.. వెంటనే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసిన గోల్డెన్ లెగ్ ట్యాగుతో ఇంకా నాలుగైదు పెద్ద హీరోల సినిమాలు సైన్ చేసేయాలని చూస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/