Begin typing your search above and press return to search.

ఏం కష్టమొచ్చిందమ్మా కాజలూ..

By:  Tupaki Desk   |   30 Aug 2015 6:26 PM GMT
ఏం కష్టమొచ్చిందమ్మా కాజలూ..
X
ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే.. ఐదారేళ్లకు మించి పీక్స్ లో కొనసాగడం కష్టమే. చాలామంది గ్లామర్ కోల్పోవడం వల్ల స్టార్ డమ్ కోల్పోతారు. ఇంకొందరు సక్సెస్ లు లేక సైడైపోతారు. కానీ కాజల్ కు ఈ రెండు విషయాల్లోనూ ఇబ్బంది లేదు. ఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్ లో అరంగేట్రం చేసినపుడు ఎంతందంగా ఉందో.. ఇప్పుడూ అంతే అందంగా ఉంది. తెలుగులో ఆమె సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. చివరగా నటించిన నాలుగు సినిమాల్లో మూడు హిట్టయ్యాయి. అయినా కారణాలేంటో తెలియదు కానీ... కాజల్ కెరీర్ స్లో అయిపోయింది. ఇక్కడ కెరీర్ నెమ్మదించగానే ఎంచక్కా తమిళంలోకి వెళ్లి సెటిలైపోయింది. ఒకేసారి మూణ్నాలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని బిజీ అయిపోయింది.

కానీ కోలీవుడ్ రీఎంట్రీలో ఆమెకు ఆరంభంలోనే పెద్ద ఫ్లాప్ ఎదురైంది. ధనుష్ సరసన నటించిన ‘మారి’ తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో కాజల్ ఆశలన్నీ ఇప్పుడు ‘పాయుం పులి’ మీదే ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగుతో ‘జయసూర్య’ పేరుతో రిలీజవుతోంది. ఈ మధ్యే ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో కాజల్ అవతారం చూసి అందరూ షాకవుతున్నారు. ముందు నుంచి కొంచెం బొద్దుగా ఉంటూ వస్తున్న కాజల్.. ఈ సినిమా కోసం బాగా సన్నబడింది. దీంతో కొంచెం గ్లో తగ్గినట్లు అనిపిస్తోంది. కాజల్ ఇంతకుముందు మరీ లావేమీ లేదు. ఆమె అలా ఉంటేనే అందం. కానీ ఎవరు సలహా ఇచ్చారో ఏమో కానీ.. ఉన్నట్లుండి చిక్కిపోవడం వల్ల కొంచెం గ్లో కోల్పోయినట్లయింది. శ్రియ, త్రిష లాంటి వాళ్లకు ఒంటిమీద కండ లేకపోవడం వల్లే వయసు పెరిగే కొద్దీ చాలా ఇబ్బందిగా తయారయ్యారు. కాజల్ ఈ సంగతి గ్రహించకుండా అనవసరంగా సన్నబడిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో కాజల్ ఎలా ఉంటుందో చూడాలి మరి.