ఓ బ్యూటీ ప్రొడ్యూసర్.. మరో బ్యూటీ స్లీపింగ్ పార్టనర్?

Tue Feb 12 2019 13:39:47 GMT+0530 (IST)

టాలీవుడ్ చందమామ కాజల్ చాలా రోజుల నుండి  నిర్మాతగా మారాలనే ఆలోచనలో ఉందట.. ఫైనల్ గా ఆ ఆలోచన కార్యరూపం దాల్చే సమయం వచ్చింది.  కేఏ మూవీస్ బ్యానర్లో ఒక సినిమాను నిర్మించాలని.. ఆ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తోందట. 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం.  ఈ సినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు కాజల్ మాత్రమే ప్రొడ్యూసర్ కాదట.  కాజల్ క్లోజ్ ఫ్రెండ్.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ప్రాజెక్టుకు స్లీపింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తుందని టాక్.  అంటే ఇద్దరు ఫ్రెండ్స్ బిజినెస్ పార్టనర్లుగా మారబోతున్నారట.  ఈ సినిమాకు కథ ఎప్పుడో ఓకే అయిందట.  కాజల్ 'అ!' సినిమాలో నటించిన సమయంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథను వినిపించడంతో అప్పుడే ఈ సినిమాను నిర్మించాలని కాజల్ నిర్ణయం తీసుకుందట.  

హీరోలు.. హీరోయిన్లు నిర్మాతగా మారడం అనే ట్రెండ్ కొత్తదేమీ కాదు. కానీ అలా నిర్మాతగా మారిన వారి విజయాల శాతం మాత్రం తక్కువే. మరి కాజల్ నిర్మాతగా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. త్వరలో కాజల్ తన బ్యానర్ వివరాలను.. మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.