Begin typing your search above and press return to search.

ఇక్క‌డ ఒక‌లా, అక్క‌డ ఇంకోలా?

By:  Tupaki Desk   |   4 Sep 2015 7:00 PM GMT
ఇక్క‌డ ఒక‌లా, అక్క‌డ ఇంకోలా?
X
క్యూట్ కాజ‌ల్ ప్ర‌తిసారీ ఓ మాట చెబుతుంది. నాకు తెలుగు సినీప‌రిశ్ర‌మ అంటే మ‌మ‌కారం ఎక్కువ‌. అవ‌కాశాలిచ్చి ఇంత‌దాన్ని చేసింది తెలుగు ప‌రిశ్ర‌మే. కానీ త‌మిళ్‌ లో క్రేజీ ప్రాజెక్టుల్ని వ‌దులుకోలేక‌పోతున్నా. తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినా క్యారెక్ట‌ర్ న‌చ్చ‌క వ‌దిలేస్తున్నా.. అని చెబుతుంటుంది. కానీ వాస్త‌వంలో అస‌లు క‌థ వేరు. కాజ‌ల్ సెల‌క్ష‌న్ పూర్తిగా రెమ్యున‌రేష‌న్‌, శ్ర‌మ రెండిటి ఆధారంగా ఉంటుంది.

టాలీవుడ్‌ లో న‌టించాలంటే ఒక రేటు, కోలీవుడ్‌ లో ఇంకో రేటు, బాలీవుడ్‌ లో మ‌రోలా .. పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంది. బాలీవుడ్ త‌ర్వాత తెలుగు సినిమాల్లోనే కాస్త ఎక్కువ‌గానే ఎక్స్ పోజ్ చేయాల్సి ఉంటుంది. శ్ర‌మ కూడా ఎక్కువ‌. అదే త‌మిళంలో నేటివిటీ సినిమాలే ఎక్కు వ కాబ‌ట్టి ఓవ‌ర్ ఎక్స్‌ పోజింగుకి ఆస్కారం క‌నిపించ‌దు. పైగా అక్క‌డ ద‌ర్శ‌కులు అన‌వ‌స‌ర ఎక్స్‌ పోజింగుకి ప్రాధాన్య‌త‌నివ్వ‌రు, క‌థ‌, క్యారెక్ట‌ర్ డ్రైవ్‌ కి అవ‌కాశం ఎక్కువ‌ .. అన్న అభిప్రాయం ఉంది. అందుకే ఇటీవ‌లి కాలంలో త‌మిళంలో ఏ అవ‌కాశం వ‌చ్చినా వెంట‌నే అంగీక‌రిస్తోంది. టాలీవుడ్ కంటే త‌మిళ ప‌రిశ్ర‌మ‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నివ్వ‌డానికి అస‌లు కార‌ణాలివే.

విజ‌య్‌ తో తుపాకిలో న‌ట‌నకు ఆస్కారం ఎక్కువ, పైగా భారీ పారితోషికం ముట్టింది. అందుకే వెంట‌నే ఓకే చెప్పింది. మ‌ళ్లీ లేటెస్టుగా పాయుం పులి (తెలుగులో జ‌య‌సూర్య‌) చిత్రంలోనూ గ్లామ‌ర్ పేరుతో అన‌వ‌స‌ర ఎక్స్‌ పోజింగుకి ఆస్కారం లేని క్యారెక్ట‌ర్‌ని ఎంచుకుంది. విశాల్ సర‌స‌న ఓ బుట్ట‌బొమ్మ‌లా ప‌ద్ధ‌తైన అమ్మాయిలా క‌నిపించింది. క్యారెక్ట‌ర్ ప‌రంగా మ‌రీ అంత శ్ర‌మించేందుకు ఆస్కారం కూడా లేనిది. అదే టాలీవుడ్‌ లో అలా కుద‌ర‌దు. బిజినెస్‌ మేన్‌, టెంప‌ర్, గోవిందుడు అంద‌రివాడేలే .. ఇవ‌న్నీ క‌థానాయిక గ్లామ‌ర్‌ ని ఆవిష్క‌రించేవే. అయితే వాటిలో న‌టించ‌డానికి కార‌ణం పారితోషికం కావాల్సినంత ముట్టింది కాబ‌ట్టే. ఇప్పుడ‌ర్థ‌మైందా కాజ‌ల్ గేమ్ ప్లాన్‌.