గూగుల్ ర్యాంకొచ్చిందనే ఈ పిచ్చా??

Sun Mar 19 2017 14:04:14 GMT+0530 (IST)

నిజానికి సమంత రేంజులో పెర్ఫామెన్సులు ఇచ్చిందే లేదు. తమన్నా రేంజులో డ్యాన్సులూ రావు. అయినాసరే గడచిన రెండేళ్లలో కాజల్ ఆగర్వాల్ సౌత్ నుండి మోస్ట్ సెర్చెడ్ బ్యూటీ అయిపోయింది అంటే చూసుకోండి. ఇప్పుడు ఆ క్రేజునే క్యాష్ చేసుకోవాలని చూస్తున్న కాజల్ ఏకంగా తన పేరుమీద ఒక యాప్ ను కూడా లాంచ్ చేసింది.

గతంలో చాలామంది నటీనటులు ఇలాంటి యాప్స్ లాంచ్ చేసుకున్నారు కాని.. ఆల్రెడీ ఫేస్ బుక్కులో పుల్లుగా యాక్టివ్ గా ఉండీ.. మళ్ళీ ట్విట్టర్ ను కూడా మెయిన్టయిన్ చేస్తున్నప్పుడు.. అసలు జనాలు ఈ హీరోయిన్ తాలూకు అప్డేట్లు కోసం ఈ సెపరేట్ యాప్స్ జోలికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఏదో గూగుల్ ర్యాంక్ వచ్చేసింది కాబట్టి ఇక తన క్రేజుకు డిజిటల్ స్పేస్ లో తిరుగుండదు అని కాజల్ అనుకోవడం కాకపోతే.. అసలు ఏదో ఫిలింఫేర్ వంటి ఈవెంట్లలో విపరీతమైన క్లీవేజ్ సోకులు ఆరబోయబట్టే తప్పించి.. లేదంటే గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్ వచ్చేదా మన భామకు?

అంతేలేండి.. సినిమాలు లేకపోయినా కూడా సన్ని లియోన్ కు నెం.1 సెర్చ్ ర్యాంక్ వచ్చేయడంతో.. ఆమె ఏకంగా పర్సనల్ పెర్ఫ్యూమ్ ఒకటి లాంచ్ చేసేసింది. ఇప్పుడు కాజల్ యాప్ లాంచ్ చేసుకుంటే ఏమొచ్చిందిలే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/