Begin typing your search above and press return to search.

కాజల్‌ రెచ్చిపోతే.. ఫిలింఫేర్‌ షాక్‌ తింది

By:  Tupaki Desk   |   16 Jan 2016 6:33 AM GMT
కాజల్‌ రెచ్చిపోతే.. ఫిలింఫేర్‌ షాక్‌ తింది
X
ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌ అవార్డులు.. నిన్న రాత్రి చోటుచేసుకున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా టాలీవుడ్‌ కు చెందిన చాలామంది హాట్‌ భామలు అక్కడ రెడ్‌ కార్పెట్‌ మీద తళుక్కుమన్నారు. అసలు మన భామలు వేసుకునే డ్రస్సులు చూస్తే.. వారు ఏ రేంజులో బాలీవుడ్ లో ఆటెన్షన్‌ తెచ్చుకోవాలని చూస్తున్నారో మనకు అర్దమైపోతుంది.

ఫిలింఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇప్పుడు కాజల్‌ ఒక పింకు కలర్‌ గౌనులో విచ్చేసింది. ఇక ఆ గౌను ఎంత లో-నెక్‌ అంటే.. ఆమె క్లీవేజ్‌ మొత్తం గాలికి సేద తీరుతున్నట్లే ఉంది. అసలు కాజల్‌ నుండి ఆ రేంజు షో మనం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. తెలుగు సినిమాల్లో ఆమె ఎల్లప్పుడూ గ్లామర్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచినా కూడా.. మరీ ఈ రేంజులో ఆరబోసిన సీన్లు మాత్రం చాలా రేర్‌. పిక్కల అందాలు, నాభి సౌందర్యం దారపోయడం తప్పించే.. ఇలా రెచ్చిపోయిందే లేదు.

బాలీవుడ్‌ లో దో లఫ్జోం కి కహానీ అనే సినిమాతో త్వరలోనే అలరించనున్న కాజల్‌.. ఆ సినిమాను, దానితో పాటు తననూ ప్రమోట్‌ చేయడానికి.. ఇలా రెచ్చిపోతుందేమో. కాని ఈవిడ అందాల ఆరబోతతో ఫిలింఫేర్‌ రెడ్‌ కార్పెట్‌ షాక్‌ తినేసిందంతే.