కాజల్ గ్లామర్ కాపాడుతుందా?

Mon Mar 20 2017 21:14:14 GMT+0530 (IST)

రంగం మూవీతో టాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో జీవా. అయితే.. ఆ తర్వాత మాత్రం దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. మెల్లమెల్లగా ఈ హీరో సినిమాలు డబ్ అవడం కూడా ఆగిపోయింది.

గతేడాది కావలై వేండాం చిత్రాన్ని మాత్రం తమిళ్ తో పాటు.. తెలుగులో కూడా రూపొందించారు. ఇందుకు కారణం ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కావడమే. తెలుగులో ఈ చిత్రానికి ఎంతవరకూ ఈ ప్రేమ అనే టైటిల్ నిర్ణయించగా.. పోస్టర్లు కూడా వేసిన తర్వాత తెలుగు వెర్షన్ రిలీజ్ ఆగిపోయింది. తమకు కనీసం సెన్సార్ చేయించుకునే టైం ఇవ్వకుండా తమిళ్ వెర్షన్ రిలీజ్ చేసేశారని తెలుగు నిర్మాతలు అన్నారు. ఇప్పుడీ కాజల్ సినిమా తెలుగు  వెర్షన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో కాజల్ ఆరబోసిన అందాలనే పెట్టుబడిగా పెట్టి.. ప్రమోషనల్ పోస్టర్స్ వేస్తున్నారు.

కాజల్ లుక్ అదిరిపోయింది కానీ.. తమిళ్ లో కావలై వేండా ఫ్లాప్ గా నిలిచింది. డీమానిటైజేషన్ తర్వాత రిలీజ్ కావడం.. సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో.. తమిళ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ ఫ్లాప్ సినిమాను భుజాలపై మోయాల్సిన బాధ్యత కాజల్ పై పడింది. మరి కాజల్ గ్లామర్ ఈ ఫ్లాప్ సినిమాను ఏ మాత్రం కాపాడనుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/