కాజల్ ది పెంచి చూపిస్తారట

Sun Jan 13 2019 12:29:35 GMT+0530 (IST)

కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో అనుకోని అవకాశాలు కాజల్ తలుపు తడుతున్నాయి. ఆ మద్య ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రాలు ఈమెకు కీలకమైన దశలో దక్కాయి. ఆ చిత్రాల వల్ల కాజల్ ఇంకా హీరోయిన్ గా అదీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. మళ్లీ ఈమద్య కాజల్ కు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ ఓకే అయిన విషయం తెల్సిందే.‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందబోతున్న ‘ఇండియన్ 2’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ ఏ సినిమా చేసినా కూడా అది మామూలుగా ఉండదు. ఈ చిత్రం కూడా అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నాడు. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొదిస్తున్నాడట. ఈ చిత్రం కోసం కాజల్ చాలా విభిన్నంగా కనిపించబోతుంది. కాజల్ మేకోవర్ కోసం యూఎస్ నుండి హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు కూడా రాబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

కాజల్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతుందట. అందులో మొదటిది కామన్ గా యంగ్ ఏజ్ అమ్మాయి కాగా రెండవది కాస్త ఏజ్డ్ ఉమెన్ పాత్ర. ఆ ఏజ్డ్ ఉమెన్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు వస్తున్నట్లుగా చెబుతున్నారు. కాజల్ వయస్సును పెంచి దర్శకుడు శంకర్ చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు కాజల్ ఇలాంటి ప్రయోగంను చేయలేదు. అయితే శంకర్ సినిమా అవ్వడం వల్ల ఈ సాహసంకు ఒప్పుకుంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.