Begin typing your search above and press return to search.

కాజల్ బిజీ.. చిరు హీరోయిన్ ఎవరు?

By:  Tupaki Desk   |   26 July 2016 10:24 AM GMT
కాజల్ బిజీ.. చిరు హీరోయిన్ ఎవరు?
X
అభిమానులు కోటిఅశలతో ఎదురుచూస్తున్న మెగాస్టార్ 150వ సినిమా షూటింగ్ మొదలైంది. వీలైనంత వరకూ అవిరామంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా కథకోసం ఎన్ని చర్చలు - ఎన్నో రోజుల ఎదురుచూపులు జరిగాయో ప్రస్తుతం ఆ సినిమా కథానాయకి విషయంలో కూడా అలానే సాగుతోందట. ఇప్పటికే కొత్తా పాతా కలిసి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. అయితే చిరు 150వ సినిమాకు కాజల్ అగర్వాల్ ఫైనల్ అయ్యిందంటూ వార్తలు వచ్చినా ఆ వార్తలను ఈ చిత్రం నిర్ధారించలేదు.

దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ చిరుకు జోడీగా కాజల్ పేరు పరిశీలనలోకి వచ్చిన మాట వాస్తమే అయినా ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నారు. అయితే కాజల్ ఎంపిక కాకపోవడానికి ఆమె బిజీ షెడ్యూలే కారణమని తెలుస్తోంది. దీంతో.. డేట్స్ ఏ స్థాయిలో అడ్జస్ట్ చేసినా కూడా చిరు 150లో కాజల్ నటించే అవకాశాలు కుదరడం లేదట. అయితే తమిళంలో అజిత్ సరసన నటించేందుకు ఇటీవల సంతకం చేసిన కాజల్ - ఆ షూటింగ్ నిమిత్తం నెలరోజులకుపైగా బల్గేరియా వెళ్లనుంది. దీంతో ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది!