Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఐటెం.. మిల్కీ కాదు కాజల్

By:  Tupaki Desk   |   29 July 2016 6:53 AM GMT
ఎన్టీఆర్ ఐటెం.. మిల్కీ కాదు కాజల్
X
అదేంటో తెలియదు కాని.. జూ.ఎన్టీఆర్ ''జనతా గ్యారేజ్‌'' సినిమాలో ఐటెం సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ పాటలో ఎవరు డ్యాన్సు చేస్తారు అనే విషయంలో నిర్మాతలు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినా కూడా.. సమంత ఓ పాటను చేయకపోవడం వలన ఈ సాంగును ఇరికించాల్సి వచ్చింది అనే రూమరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ సాంగులో హాటుగా అందాలు ఆరబోసేది ఎవరు?

మొన్నటివరకు మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ఈ పాటలో తన సోయగాలు ఆరబోయనుందని టాక్‌ వచ్చింది. పైగా అమ్మడికి ఇటువంటి పాటలు అస్సలు కొత్తేం కాదు. ఎందుకంటే గతంలో రెండు సార్లు ఐటెం సాంగుల్లో నా ఇంటి పేరు మిల్కు అంటూ సెక్సీ స్టెప్పులతో మతి పోగొట్టేసింది. ఇప్పుడు అమ్మడు మరోసారి ఎన్టీఆర్ తో కూడా అదే విధంగా ఓ ఐటెం చేస్తుందని టాక్‌ వచ్చింది. కాని చివరకు పారితోషకం భారీగా ఆఫర్ చేసినా కూడా.. ఈ పాటలో మెరవడానికి ససేమిరా అనేసిందట తమన్నా. ఆమెకు బాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయట. ఈ తరుణంలో ఐటెం సాంగు వద్దులే అనుకుందట.

అయితే దర్శకుడు కొరటాల శివ అండ్ టీమ్.. వెంటనే ఈ పాటలో చేయడానికి హీరోయిన్ కాజల్ ను ఒప్పించేశారు. మొన్ననే ''టెంపర్'' సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ గా చేసిన కాజల్.. ఇప్పుడు అతని పక్కనే తన కెరియర్ తొలి ఐటెం సాంగు చేయడం కొత్తగానే ఉంది మరి. ఈ విధంగా హాటుగా స్టెప్పులు వేయడానికి పాప ఓ కొటి పుచ్చుకుంటోందని తెలుస్తోంది.