Begin typing your search above and press return to search.

కాజల్ మళ్ళీ వశం చేసుకున్నట్లే

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:16 AM GMT
కాజల్ మళ్ళీ వశం చేసుకున్నట్లే
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ ఫుల్లు బూమ్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సక్సస్ సాధించినా.. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన కాజల్ కు మాత్రం కాలం కలిసి రాలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు బ్యాడ్ టైం ఫేస్ చేసిన చందమామ.. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో టాప్ గేర్ లోకి చేరుకుంది.

అక్కడి నుంచి సినిమాల కౌంట్ విషయంలో స్పీడ్ చూపించట్లేదు కానీ.. సెలక్షన్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడు సౌత్ అంతా తెగ డిస్కస్ చేసుకుంటున్న మూవీ వివేకం. ఇవాళ రిలీజ్ అవుతున్న అజిత్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ గురించి కూడా జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. కాజల్ తర్వాత సినిమాల్లో వచ్చిన సమంత.. శృతి హాసన్ లు ఓ సమయంలో.. చందమామను ఓవర్ టేక్ చేసేశారని ఒప్పుకోవాల్సిందే. కానీ కాసింత అడుగు వెనక్కు వేసినా.. మళ్లీ రెట్టించిన వేగంతో కాజల్ రేసులోకి వచ్చేసింది. అందరినీ వెనక్కు నెట్టేసి.. టాప్ హీరోయిన్ స్టేటస్ ను మళ్లీ తన వశం చేసేసుకుందని చెప్పవచ్చు.

రీసెంట్ గా రానాతో నటించిన నేనే రాజు.. నేనే మంత్రి చిత్రంలో కూడా కాజల్ బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు వివేగం చిత్రం ద్వారా అలరించబోతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న మెర్సల్ (తెలుగులో అదిరింది) లో కూడా చందమామే హీరోయిన్. కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే చిత్రంలో చేసేస్తోంది. నాగార్జున మూవీ రాజుగారి గది2లో కూడా ఓ కీలక పాత్రలో నటించేసింది. ఈ సినిమాల రాసి.. వాసి చూస్తే.. కాజల్ మళ్లీ తన అగ్రపీఠాన్ని తిరిగి దక్కించుకుంది అనడంలో.. ఎనీ డౌట్స్!