Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తో ప‌నైందంటున్న కాజ‌ల్‌!

By:  Tupaki Desk   |   28 Nov 2015 1:30 PM GMT
ప‌వ‌న్ తో  ప‌నైందంటున్న కాజ‌ల్‌!
X
ప‌వ‌న్ క‌ళ్యాన్ తో న‌టించాల‌ని ప్ర‌తి ఒక్క హీరోయిన్‌ కి ఉంటుంది. అలాగే కాజ‌ల్ కూడా చాల కాలం నుంచి ఆ కోరిక అలాగే ఉండిపోయింద‌ట‌. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కాజ‌ల్ ని హీరోయిన్‌ గా ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇంత వ‌ర‌కు కాజ‌ల్ ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొన లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జరిగిన రెండు షెడ్యూల్స్ కూడా హీరోయిన్ లేకుండానే పూర్తి చేసాడు దర్శకుడు బాబి.

ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ స‌ర్దార్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్‌ లో కాజల్ జాయిన్ అయ్యిందట‌. కాజల్ - పవన ల‌ ఫై కొన్ని మెయిన్ సీన్స్ పిక్చ‌రైజ్ చేశారు. ఇందులో ఒక స్టిల్ ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంటు ద్వారా అప్ లోడ్ చేసింద‌ట‌. ఆ స్టిల్ తో పాటు స‌ర్దార్ షూటింగ్‌ లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఎదురు చూశా ఇన్ని రోజులు. ఈరోజు తో ఆ కల నెరవేరింది. అలాగే చాలా రోజులుగా ప‌వ‌న్ తో సినిమా చేయాల‌నుకుంటున్న కోరిక కూడా తీరిపోవ‌డంతో ఓ పనియిపోయిందంటూ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ‌.

ఈ షెడ్యూల్ లో మరో భామ సంజన కూడా పాల్గొనే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్‌ లో మురిసిపోతుందో చూడాలి. ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పీడు చూస్తుంటే అనుకున్న స‌మ‌యానికి రావ‌డం ఖాయంలా క‌నిపిస్తుంది.