Begin typing your search above and press return to search.

సెక్సీ బ్యాక్ అంటున్న కాజల్

By:  Tupaki Desk   |   25 July 2016 3:30 PM GMT
సెక్సీ బ్యాక్ అంటున్న కాజల్
X
ఆ బ్యాక్ చూసి సెక్సీనా కాదా అని మనం చెప్పాలి కాని.. ''ఐ యామ్ బ్రింగింగ్ సెక్సీ బ్యాక్'' అంటూ తనకు తానే చెప్పుకుంటోంది టాలీవుడ్ చందమామ కాజల్. అమ్మడు ఇప్పుడు తన బ్యాక్ ను చూపిస్తూ.. చూశారా ఎంత సెక్సీగా ఉందో అంటూ స్టేట్మెంట్లు ఇస్తోంది. సర్దార్ - బ్రహ్మోత్సవం సినిమా టైముకే అమ్మడు బాగా వెయిట్‌ తగ్గిపోయిందనే విషయం మనకు తెలిసిందే. కాని ఆ స్లిమ్ హీట్ సక్సెస్ లను మాత్రం అందించట్లేదు.

ప్రస్తుతం తమిళంలో జీవా సరసన ఒక సినిమా చేస్తోంది కాజల్. ఈ సినిమా పేరు కావలై వేండన్. ఈ సినిమా కోసం బెంగుళూరులోని ఒక ప్రముఖ మాల్ లో షూటింగ్‌ చేస్తున్నారు. అక్కడ అమ్మడు వైట్‌ డ్రస్సులో అలా రెచ్చిపోయింది. కెమెరా రన్నింగ్ అవ్వకమునుపు శాలువా కప్పుకొని కూర్చున్న కాజల్‌.. షాట్ రెడీ అనగానే శాలువా తీసేసి ఇలా పిచ్చెత్తించిందట. ఇప్పటికే సాంగ్స్ కోసం పొట్టి గౌనుల్లో హాటుగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఇలా బ్యాక్ లెస్ అందాలతో తమిళ ఫ్యాన్సును ఖుషీ చేయడానికి రెడీ అయ్యిందనమాట.

ఇవన్నీ సరే.. అసుల చిరంజీవి 150వ సినిమాను నీకు ఆఫర్ చేశారా లేదా? ఒకవేళ చేస్తే నువ్వు చేస్తున్నావా లేదా? ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వొచ్చుగా కాజల్‌. అవతల మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ నానా!!