Begin typing your search above and press return to search.

కాజల్ ను భూతంగా చూడాలా?

By:  Tupaki Desk   |   23 July 2017 4:59 AM GMT
కాజల్ ను భూతంగా చూడాలా?
X
సీనియర్ హీరోయిన్.. స్టార్ హీరోయిన్.. ట్యాలెంటెడ్ హీరోయిన్.. ఇలా ట్యాగులు తగిలించుకునే స్థాయికి భామలు వచ్చేసినపుడు.. రకరకాల ప్రయోగాలతో ఆఫర్స్ వస్తుంటాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలంటూ ఫిలిం మేకర్స్ అడుగుతుంటారు. సోలోగా తమ స్టామినా ప్రూవ్ చేసుకోవాలనే తలంపుతో.. పలువురు ఇందుకు సై అనేస్తుంటారు.

కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు విపరీతమైన క్రేజ్ ఉన్నా.. ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. పెర్ఫామెన్స్ చేయగల అందాల భామగా గుర్తింపు లభించినా.. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ నే కంటిన్యూ చేస్తోంది. కానీ ఇప్పుడు కాజల్ కు కూడా ఉమెన్ సెంట్రిక్ మూవీ పురుగు కుట్టేసిందట. ఎప్పటి నుంచో తన మదిలో ఉన్న ఆలోచనకు ఇప్పుడు వాస్తవరూపం ఇవ్వబోతోందని తెలుస్తోంది. అది కూడా హారర్ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇంతగా ఆమెను మెప్పించేలా ఓ మాంచి కథ కాజల్ దగ్గరకు చేరడమే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం అని సన్నిహితులు చెబుతున్నారు.

పైగా హారర్ చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన ఓ సౌత్ ఫిలిం మేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండడం కూడా.. కాజల్ ను కన్విన్స్ చేసిన పాయింట్ గా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టకుు కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుండడంతో.. అందాల కాజల్ ను ఆన్ స్క్రీన్ భూతంగా చూడక తప్పదు ప్రేక్షకులకు. ఇక ప్రస్తుతం రానాకు హీరోయిన్ గా నేనే రాజు నేనే మంత్రి చిత్రం విడుదల కోసం చూస్తున్న కాజల్.. కళ్యాణ్ రామ్ తో కలిసి ఎమ్మెల్యే మూవీలో సందడి చేయనుంది.