Begin typing your search above and press return to search.

మ‌హేష్‌.. కాజ‌ల్ ను క‌రుణించాడు

By:  Tupaki Desk   |   2 May 2016 2:31 PM GMT
మ‌హేష్‌.. కాజ‌ల్ ను క‌రుణించాడు
X
బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో హీరోయిన్లు ఎవ‌రంటే ముందు స‌మంత పేరు చెప్పి.. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా కాజ‌ల్ అగ‌ర్వాల్.. ప్ర‌ణీత‌ల పేర్లు గుర్తు తెచ్చుకుంటారు జ‌నాలు. మ‌హేష్‌-స‌మంత కాంబినేష‌న్ కు ఉన్న క్రేజ్ వ‌ల్ల కావ‌చ్చు.. బ్ర‌హ్మోత్స‌వం టీం ముందు నుంచి స‌మంత‌కు ఇస్తున్న ప్రయారిటీ వ‌ల్ల కావ‌చ్చు.. ఈ సినిమాలో ఆమే లీడ్ హీరోయిన్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు జ‌నాలు. గ‌త కొన్ని రోజుల్లో బ‌య‌టికి వ‌చ్చిన బ్ర‌హ్మోత్స‌వం కొత్త పోస్ట‌ర్ల‌లో సైతం స‌మంతే క‌నిపించింది త‌ప్ప కాజ‌ల్ లేదు. దీంతో మ‌హేష్ కాజ‌ల్ ను చిన్న చూపు చూస్తున్నాడ‌ని ఆమె అభిమానులు ఫీల‌య్యారు.

ఐతే కాజ‌ల్ ఫ్యాన్స్ చింత తీర్చేశాడు మ‌హేష్‌. చంద‌మామ‌తో రాజ‌కుమారుడు క‌లిసి ఉన్న బ్ర‌హ్మోత్స‌వం కొత్త పోస్ట‌ర్ ఈ రోజే రిలీజైంది. ఇద్ద‌రూ క‌లిసి ఎంచ‌క్కా విహార యాత్ర‌కు వెళ్తూ మ‌ధ్య‌లో ఆగి రిలాక్స‌వుతున్న‌ట్లుగా ఉంది ఈ ఫొటో చూస్తుంటే. వెహిక‌ల్లో వ‌య్యారంగా ప‌డుకుని కాజ‌ల్ సేద‌దీరుతుంటే.. బ‌య‌ట ఛైర్ వేసుకుని స్టైల్ గా కూర్చుకున్నాడు మ‌హేష్‌. మొత్తానికి కొత్త పోస్ట‌ర్ అభిమానుల‌కు భ‌లే కిక్కిచ్చేలా ఉంది. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన పోస్ట‌ర్ల‌లాగే ఇది కూడా చాలా క‌ల‌ర్ ఫుల్ గా ఉండి జ‌నాల్ని ఇట్టే ఆక‌ట్టుకుంది. ఇక మూడో హీరోయిన్ ప్ర‌ణీత మాత్ర‌మే మిగిలుంది. మ‌హేష్ ఆమెతో క‌లిసి ఉన్న పోస్ట‌ర్ కూడా వ‌దిలేస్తే ఓ ప‌నైపోతుంది. ఏడో తారీఖున ఆడియో రిలీజ‌య్యే లోపు ఆ భాగ్యం కూడా దొర‌క్క‌పోదులెండి.