Begin typing your search above and press return to search.

కాజ‌ల్ ఎంట్రీ ఇచ్చింది!

By:  Tupaki Desk   |   4 May 2016 4:42 PM GMT
కాజ‌ల్ ఎంట్రీ ఇచ్చింది!
X
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ ఎంత కీల‌కంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏదున్నా లేక‌పోయినా సోష‌ల్ నెట్క‌వ‌ర్కింగ్ సైట్ల‌లో ఎకౌంట్ మాత్రం ఉండాలంతే. లేదంటే `నువ్వేమ‌న్నా ఆది మాన‌వుడా?` అనిపించుకోవ‌ల్సి వ‌స్తుంది. అందుకే జ‌నాల‌కు దూరంగా ప్రైవేట్‌ గా గ‌డిపే సినీ తార‌లు కూడా సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ల‌లో చేరి అక్కడ ఓపెన్‌ గా వాళ్ల వాళ్ల అంత‌రంగాల్ని ఆవిష్క‌రిస్తున్నారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానుల్ని త‌మ అకౌంట్ చుట్టూ తిప్పుకుంటుంటారు.

ఇప్పుడు సినీ తార‌ల క్రేజ్‌ కి ట్విట్టరు - ఫేస్‌ బుక్కుల్లో ఫాలోయింగ్ కూడా కొల‌మానంగా మారింది. ఎంత‌మంది ఫాలో అయితే అంత క్రేజ్ ఉన్న‌ట్టు లెక్క‌న్న‌మాట‌. అందుకే త‌మ క్రేజ్ ఎంతుందో తెలుసుకోవ‌డానికైనా అన్న‌ట్టుగా సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ సైట్ల‌లో చేరిపోతుంటారు. ముఖ్యంగా మెజారిటీ తార‌లు ట్విట్ట‌ర్‌ లో క‌నిపిస్తుంటారు. వాళ్లు ప్ర‌తీ క్ష‌ణం ఏం చేస్తున్నారో అందులో ఓపెన్ అప్ అవుతుంటారు. అయితే సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్‌ కి ఫేస్‌ బుక్‌ లో అకౌంట్ వుంది కానీ.. ఆమె ఇప్ప‌టిదాకా ట్విట్ట‌ర్‌ లో చేర‌లేదు. తోటి న‌టీన‌టులు ట్విట్ట‌ర్‌ లో అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌మ్మా అన్నా కూడా ఆమె ఇన్నాళ్లూ చూద్దాం చూద్దాం అంటూ వ‌చ్చేసింది. కానీ ట్విట్ట‌ర్‌ లో చేర‌డం అత్య‌వ‌స‌రం అన్న విష‌యం ఆమెకి ఇటీవ‌లే తెలిసొచ్చిన‌ట్టుంది. అందుకే సైలెంటుగా అకౌంట్ ఓపెన్ చేసేసింది. కాజ‌ల్ అగ్గ‌ర్వాల్ @ఎమ్మెస్ కాజ‌ల్ అగ‌ర్వాల్ అన్న అకౌంట్‌తో ఆమె ట్విట్ట‌ర్ లో చేరిపోయింది. కాజ‌ల్ ట్విట్ట‌ర్‌ లోకి వ‌చ్చింద‌న్న విష‌యం తెలుసుకొని ఆమె అభిమానులు పెద్దఎత్తున ఫాలో అవుతున్నారు. అలాగే తోటి న‌టీన‌టులు కూడా ఆమెకి వెల్క‌మ్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.