కోర్టులో కనిపించిన కాజల్

Sun Jul 16 2017 15:01:56 GMT+0530 (IST)

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఫ్యాషన్ వరల్డ్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ భామకు మాత్రం హాలిడే టూర్స్ అంటే మహా ఇష్టం. స్పోర్ట్స్ పై కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా  జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో దర్శనమిచ్చింది కాజల్.

లండన్ లో వింబుల్డన్ 2017 మహిళల ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రిజల్ట్ ఇప్పటికే ప్రపంచానికి షాక్ ఇచ్చింది. 14వ సీడ్ గా అడుగుపెట్టిన గార్బిన్ ముగురుజా.. వీనస్ విలియమ్స్ ను ఓడించి వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచింది. అంతే కాదు.. ఫైనల్ మ్యాచ్ లలో విలియమ్స్ సిస్టర్స్ ఓడించిన ఏకైక వ్యక్తిగా రికార్డ్ సృష్టించింది కూడా. అయితే.. ఈమ్యాచ్ జరుగుతున్న సమయంలో సెంటర్ కోర్టులో దర్శనమిచ్చింది టాలీవుడ్ చందమామ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్.. వింబుల్డన్ సెంటర్ కోర్ట్ నుంచి కొన్ని ఫోటోలను కూడా నెట్ లో షేర్ చేసింది.

'సక్సెస్ లలో వీనస్ విలియమ్స్ డ్రీమ్ రన్ కు బ్రేక్ వేసి వింబుల్డన్ గెలుచుకున్న ముగురుజాకు అభినందనలు. సెంటర్ కోర్టులో ఉన్నా. వింబుల్డన్ సెంటర్ కోర్ట్ లాంటి ప్లేస్ మరొకటి ఉండదు' అంటూ తన ఆనందాన్ని.. అభినందనలు ఒకే పోస్ట్ లో చెప్పేసింది కాజల్ అగర్వాల్. రెడ్ కలర్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో చందమామ షేర్ చేసిన ఫోటోలు.. చూపరులను భలే ఆకట్టుకున్నాయి.