Begin typing your search above and press return to search.

నల్ల రంగేసిన చందమామ ఇదుగో

By:  Tupaki Desk   |   9 Oct 2015 1:30 AM GMT
నల్ల రంగేసిన చందమామ ఇదుగో
X

కాజల్ పని అయిపోయిందహో.. అని చాటింపు వేశారు కొన్నాళ్ల క్రితం చాటింపు వేశారు. కాని కింద పడ్డ బంతి అంత వేగంగానూ పైకొస్తుందనే బాద్ షాలో సిద్ధాంతం చెప్పినట్లుగానే.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది ఈ చందమామ కెరీర్. మహేష్ పక్కన బ్రహ్మోత్సవం - పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ లలో ఛాన్స్ దక్కించుకుని, తన సత్తా ఏంటో చాటి చెప్పింది.

అంతే కాదు ఈ ఏడాది కాజల్ నటించిన 3 సినిమాలు హిట్‌ కొట్టాయి. తెలుగులో ఎన్టీఆర్ టెంపర్ - తమిళ్ లో మారి తో యావరేజ్‌ - పాయుం పులిలతో హిట్లు దక్కించుకుంది. ప్రస్తుతం హిందీలో ఒకటి - తెలుగులు రెండు - తమిళ్ లో మూడు సినిమాలు చేసేస్తోందీ చందమామ. అంతా అయిపోయిందని అనుకునే టైంలో వచ్చిన వరుస ఆఫర్స్.. కాజల్ ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే పార్టీలకు కూడా బాగానే అటెండ్ అవుతోంది. రీసెంట్ గా ముంబైలో గ్లెండ్ ఫిచ్ అనే ఓ లిక్కర్ కంపెనీ ఇచ్చిన పార్టీలో బ్లాక్ డ్రస్ తో వచ్చి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. తన స్నేహితురాలు మిల్కీ బ్యూటి తమన్నాతో కలసి ఫుల్‌ గా ఎంజాయ్‌ చేసిందిలే.

సాధారణంగా ఆఫర్స్ తక్కువగా ఉన్నపుడు.. వార్తల్లోకెక్కేందుకు ఇలా పార్టీలు, డిన్నర్లు అని తిరుగతుంటారు హీరోయిన్లు. కానీ కాజల్ రూటే సెపరేట్. ఛాన్సులు చేతినిండా ఉన్నా.. అడిగినోళ్లని కాదనకుండా పార్టీలకి వచ్చేస్తోంది. బాహుబలి హిట్ తో బాలీవుడ్ లోనూ పేరు సంపాదించుకున్న తమన్న.. ఇక కాజల్‌ తో కలసి బాండింగ్‌ అవుతుంటే.. ఆ కిక్కేవేరబ్బా అంటున్నవారు ఉన్నారులే.