కనకదుర్గ కోసం ఇద్దరు బ్యూటీలు!

Thu Mar 21 2019 23:00:01 GMT+0530 (IST)

మాస్ మహారాజా స్పీడ్ ఈమధ్య కాస్త తగ్గినమాట వాస్తవమే. ముఖ్యంగా 'అమర్ అక్బర్ అంటోని' తర్వాత తన తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో పునరాలోచనలో పడ్డాడు. వెంటనే సెట్స్ పైకి వెళ్ళాల్సిన సినిమాల విషయంలో కూడా కాస్త టైమ్ తీసుకొని.. స్క్రిప్ట్ ను పకడ్బందీగా ఉందని నిర్థారించుకున్న తర్వాత గానీ షూటింగ్ మొదలు పెట్టేందుకు ఒప్పుకోవడంలేదు. ప్రస్తుతం రవితేజ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.  అందులో ఒకటి వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం 'డిస్కోరాజా'.  రెండవది 'తెరి' రీమేక్.వీఐ ఆనంద్ - రవితేజ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇక 'తెరి' రీమేక్ సన్నాహాలు కూడా ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. సంతోష్ శ్రీనివాస్ మొదట ఈ రీమేక్ స్క్రిప్ట్ ను పవన్ స్టైల్ కు అనుగుణంగా తీర్చిదిద్ధినప్పటికీ పవన్ తో సెట్స్ మీదకు తీసుకెళ్ళడం కుదరలేదు. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఈ స్క్రిప్ట్  రవితేజ దగ్గరకు వచ్చింది.  రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు మరోసారి ఈ స్క్రిప్ట్ కు మార్పుచేర్పులు చేసి రవితేజను మెప్పించాడట సంతోష్ శ్రీనివాస్.  దీంతో ఈ సినిమాను కూడా 'డిస్కోరాజా' తో పాటుగా సమాంతరంగా షూటింగ్ చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడట.

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రీసెంట్ గా ఫిలిం ఛాంబర్లో ఈ సినిమా కోసం 'కనకదుర్గ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.  ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ .. కాథరిన్ ట్రెసాలను ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు కూడా వెల్లడవుతాయని సమాచారం.