Begin typing your search above and press return to search.

చంద‌మామ పిచ్చి పిచ్చిగా..!

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:00 AM GMT
చంద‌మామ పిచ్చి పిచ్చిగా..!
X
చంద‌మామ చిలౌట్ చూశారా? కుర్ర‌ హీరోతో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. న‌చ్చిన‌ట్టు స‌ర‌దా స‌ర‌దాగా ఉంటోంది. యువ‌హీరో బెల్లంకొండ‌తో ఆన్‌ లొకేష‌న్ ఉందిప్పుడు. లొకేష‌న్‌ లోనే ఇదివ‌ర‌కూ కికి ఛాలెంజ్‌ లోనూ పాల్గొంది. అప్పుడు బెల్లంకొండ‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులేసి ఆ వీడియోల్ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌మోట్ చేసింది.

మారోసారి అదిరిపోయే స‌ర్‌ ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది కాజ‌ల్. టీమ్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని సాయి శ్రీ‌నివాస్ స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో చంద‌మామ చిలౌట్ పీక్స్‌ లో ఉంది. త‌నకు క‌థానాయిక‌గా తొలి అవ‌కాశాన్నిచ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌తో - యంగ్ అండ్ డైన‌మిక్ బెల్లంకొండ‌తో ర‌క‌ర‌కాల ఫోజులిచ్చింది చంద‌మామ‌. ఈ ఉల్లాసం - ఉత్సాహం చూస్తుంటే మునుపెన్న‌డూ క‌నిపించ‌ని గ్లో చంద‌మామ‌లో క‌నిపిస్తోంది. ఇక బెల్లంకొండ గోపికా కృష్ణుడిగా మారిపోయి చాలానే ర‌చ్చ చేస్తున్నాడు.

కాజ‌ల్ ఆలోచ‌న‌లే డిఫ‌రెంట్. ఓవైపు స్టార్ హీరోల‌తో న‌టిస్తూనే - మ‌రోవైపు కుర్ర‌హీరోల‌కు స్కోపిస్తోంది. త‌న‌కు ఇష్ట‌మైన ద‌ర్శ‌కులు అడ‌గాలే కానీ - నో చెప్ప‌దు. అలా బెల్లంకొండ‌-తేజ సినిమాకి క‌మిటైంది. ఈ త‌ర‌హాలోనే ఇదివ‌ర‌కూ ప్ర‌శాంత్ వ‌ర్మ వినిపించిన ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుకు ఓకే చెప్పింది. కాజ‌ల్ న‌టించిన `అ!` చ‌క్క‌ని విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. చంద‌మామ కాజ‌ల్‌ లోని వైవిధ్యానికి ఇదో ప్రూఫ్‌. ఇక యువ‌హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌ లో పాజిటివ్ వైబ్రేష‌న్స్ క్రియేట్ చేస్తూ ఉత్సాహం పెంచ‌డం చూస్తుంటే కాజ‌ల్‌ లోని స్పోర్టివ్‌ నెస్‌ ని మెచ్చుకోకుండా ఉండ‌లేం.