Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇదో స్వీట్ థ్యాంక్ యు

By:  Tupaki Desk   |   15 Dec 2018 2:45 PM GMT
ఫోటో స్టొరీ: ఇదో స్వీట్ థ్యాంక్ యు
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇప్పటికే దశాబ్దం దాటింది. 2004 లో ఫస్ట్ సినిమా బాలీవుడ్ చేసిన ఈ భామ 2007 లో మొదటి తెలుగు సినిమా 'లక్ష్మి కళ్యాణం' లో నటించింది. ఈ జెనరేషన్లో ఇన్నేళ్ళు హీరోయిన్ గా కొనసాగడమే ఒక గొప్ప విషయం. అయినా ఇంకా జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఒక అరడజను ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దీన్ని బట్టి కాజల్ ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఎంత పోటీ ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు.

సినిమా ఆఫర్లను ఓడిసిపట్టడం లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా చాలా యాక్టివ్. సోషల్ మీడియాలో ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. తరచుగా అప్డేట్లు ఇవ్వడం.. ఫ్యాన్స్ తో చాట్ చేయడంలాంటివి చేస్తూ ఫాలోయర్లను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కాజల్ అగర్వాల్ ఫాలోయర్స్ సంఖ్య 9 మిలియన్స్ దాటింది. ఈ సందర్భంగా ఒక క్యూట్ ఫోటో పోస్ట్ చేసింది కాజల్. ఫాలోయర్స్ అందరికీ ఒక కిస్ ఇస్తున్నట్టుగా ఒక పోజిచ్చింది.

ఈ క్యూట్ ఫోటోతో పాటుగా ఒక పేద్ద.. మెసేజ్ పోస్ట్ చేసింది. ఆ మెసేజ్ ని ఒక్క ముక్కలో చెప్తే 'థ్యాంక్ యూ'. కొంచెం విడమరిచి చెప్తే ఇంతకాలం నుండి మీరందరూ ఎంతో సపోర్ట్ గా ఉన్నారని.. నా జర్నీలో మీరందరూ ఒక భాగమని.. ఎప్పటికీ మీ ఋణం తీర్చుకోలేనని చెప్పుకొచ్చింది.