Begin typing your search above and press return to search.

అదిగో.. చిరంజీవి 150లో కాజల్ జాయినైంది

By:  Tupaki Desk   |   25 Aug 2016 8:57 AM GMT
అదిగో.. చిరంజీవి 150లో కాజల్ జాయినైంది
X
ఇంతకీ ''ఖైదీ నెం 150''లో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ ఎవరు? ఈ విషయంపై అనేకానేక చర్చలు జరిగాక.. ఇప్పుడు ఫైనల్ గా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా సెట్టయిపోయింది. అయితే ఈ విషయం అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోవడంతో ఇంకా ఎవరన్నా హీరోయిన్ ను తీసుకుంటున్నారా అనే సందేహం వచ్చింది. కాని కాజలే ఫైనల్ అనే విషయం ఇదిగో ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే అర్ధమవుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కాజల్ కొన్ని టాకీ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అదిగో ఫోటోలో చూస్తున్నారుగా.. కాజల్ తో చిరంజీవి ఏదో మాట్లాడుతున్నారు. చిరంజీవిని ఫోటో తీయాలనే ఉద్దేశ్యంతో కాజల్ ఫేస్ కవర్ కాకుండా కేవలం మెగాస్టార్ ఫోటోనే క్లిక్కనిపించారు ఎవరో అభిమానులు. కాకపోతే కాజల్ అని బ్యాక్ నుండి చూసినా కూడా గుర్తుపట్టేయొచ్చు.

శరవేగంగా టాకీ పార్టును షూట్ చేసేసి.. ఫారిన్ లో చిరంజీవి అండ్ కాజల్ పై పాటలు షూట్ చేస్తారట. మొత్తానికి ఇటు చిరంజీవితో అటు తమ్ముడు పవన్ తో.. ఇటు చరణ్‌ తో అటు కజిన్ బన్నీతో.. అందరితో వర్కు చేసిన హీరోయిన్ గా కాజల్ చరిత్రలోకి ఎక్కేస్తోంది.