Begin typing your search above and press return to search.

మాస్ రాజాకి నో చెప్పానన్న చందమామ

By:  Tupaki Desk   |   23 March 2018 7:16 PM GMT
మాస్ రాజాకి నో చెప్పానన్న చందమామ
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టాప్ రేంజ్ హీరోయిన్. దశాబ్ద కాలానికి పైగా టాప్ హీరోయిన్ రేంజ్ ను కొనసాగిస్తున్న కాజల్.. ఈ మధ్య మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తోంది. గతేడాది దగ్గుబాటి రానాతో నేనేన రాజు నేనే మంత్రి.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే చిత్రాలతో హీరోయిన్ గా మెరుస్తోంది చందమామ.

అయితే.. ఈ స్టార్ హీరోయిన్ ఈ మధ్య ఓ స్టార్ హీరోయిన్ సినిమాకు నో అనేసిందనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే ప్రమోషన్స్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. వరుసగా చాలానే సినిమాలు యాక్సెప్ట్ చేసినట్లు చెబుతోంది. కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందనున్న సినిమా అవకాశాన్ని కాదనుకున్నట్లు చెప్పింది కాజల్. ఇందుకు కారణం కూడా తనే వివరించింది. శ్రీను వైట్ల ఫ్లాప్స్ లో ఉన్నాడని కానీ.. రవితేజతో ఫ్లాప్ సెంటిమెంట్ కానీ ఈ చిత్రాన్ని వదులుకోవడాని రీజన్ కాదనిచెప్పిన ఈ భామ.. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినట్లు తెలిపింది.

బాలీవుడ్ క్వీన్ మూవీ తమిళ రీమేక్ లో లీడ్ రోల్ లో నటిస్తోంది కాజల్. ఆ సినిమాకు ఇచ్చిన డేట్స్.. రవితేజ మూవీకి అడిగిన కాల్షీట్స్ విషయంలో క్లాష్ వచ్చిందట. ఆయా సినిమాల షూటింగ్స్ ఇప్పటికే షెడ్యూల్ అయిపోయి ఉండడంతో.. మాస్ మహరాజ్ మూవీలోచేసే అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పింది కాజల్.