Begin typing your search above and press return to search.

భారతీయుడు 2.. క‌మ‌ల్ తోనే స‌మ‌స్య‌?!

By:  Tupaki Desk   |   20 May 2019 5:39 AM GMT
భారతీయుడు 2.. క‌మ‌ల్ తోనే స‌మ‌స్య‌?!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న‌ `భార‌తీయుడు 2` చిత్రీక‌ర‌ణ ప‌దే ప‌దే ఎందుకు వాయిదా ప‌డుతోంది? అస‌లు ఆల‌స్యానికి కార‌ణం ఎవ‌రు? ప‌్ర‌తిసారీ వాయిదా అంటూ ప్ర‌చారం ఎందుకు? అంటే ఇదిగో అన్నిటికీ ఆ సినిమా క‌థానాయిక కాజ‌ల్ స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే కాజ‌ల్ చెప్పిన దానిని బ‌ట్టి కొంత‌వ‌ర‌కూ క‌మ‌ల్ హాస‌న్ బిజీ షెడ్యూల్స్ తో పాటు ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

`భార‌తీయుడు 2` కొత్త షెడ్యూల్ ఎప్పుడు? సెట్స్ కెళుతుందా లేదా? అని ప్ర‌శ్నిస్తే కాజ‌ల్ ఇచ్చిన ఆన్స‌ర్ ఇది. ``ప్ర‌స్తుతం కమల్‌ సార్‌ బిజీ బిజీ. పొలిటిక‌ల్ బ‌రిలో ఉన్నారు. ఆ హ‌డావుడి అంతా ముగిశాక‌.. జూన్‌ నుంచి భార‌తీయుడు 2 సెట్స్ పైకి వెళుతుంది`` అని కాజ‌ల్ అన్నారు. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. శర్వానంద్ స‌ర‌స‌న ఓ సినిమా త‌మిళ హీరో జయం రవితో వేరొక సినిమా చేశాను. ఇవి రెండూ త్వరలోనే విడుదలవుతున్నాయి. సాధ్యమైనంత తొంద‌ర్లోనే మ‌రో కొత్త సినిమా వివ‌రాలు చెబుతాను. ఆ సినిమా బ‌హుభాషా చిత్రం అని కాజ‌ల్ తెలిపారు.

నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు .. అవును ఆ త‌ర‌హా క‌థ‌లు వ‌చ్చినా న‌చ్చితేనే చేస్తున్నాన‌ని తెలిపారు. నాయికా ప్రాధాన్య‌త అన‌గానే.. క‌థ చెప్పేట‌ప్పుడే ఆ ఫీల్ నాకు క‌ల‌గాలి. లేదా ఇత‌ర నాయిక‌లంతా చేస్తున్నార‌ని నేను కూడా ఆ త‌ర‌హా అంగీక‌రించ‌లేను అని త‌న అభిప్రాయం వెల్ల‌డంచారు. నేను గీసిందే గీత కాబ‌ట్టి సీత చిత్రంలో న‌టిస్తున్నాన‌ని కాజ‌ల్ సింపుల్ గా న‌వ్వేశారు. న‌చ్చిన‌వాటినే ఎంచుకుని ఎవ‌రితోనూ పోల్చుకోకుండా నా లైఫ్ ని నేను సాగిస్తున్నాన‌ని వేదాంత ధోర‌ణిలో చెప్పుకొచ్చారు.

23న ఎన్నికల ఫలితాలు విడుద‌ల‌వుతున్నాయి క‌దా? మీ ఆస‌క్తి ఎంత‌వ‌ర‌కూ? అని ప్ర‌శ్నిస్తే.. అన్నిచోట్లా ఆ విష‌యాన్నే మాట్లాడుకుంటున్నారు. నా వ‌ర‌కూ నేను ఓటేసే సౌత్ ముంబై గురించే ఆలోచిస్తాను. అక్క‌డ అభ్య‌ర్థులు ఎవ‌రు? ఎవ‌రు గెలుస్తారు? అని ఆరాతీస్తాను. అంత‌కుమించి రాజ‌కీయాల గురించి ఆలోచించ‌లేను అని తెలిపారు. ఎన్నిక‌ల ఫ‌లితాల మ‌రునాడే(24మే) `సీత` రిలీజ‌వుతోంది. సినిమా గురించి మాత్ర‌మే ఆలోచిస్తాన‌ని కాజ‌ల్ అన్నారు.