Begin typing your search above and press return to search.

ఈ క్యారక్టర్లు ఏంటమ్మా కాజల్?

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:45 PM GMT
ఈ క్యారక్టర్లు ఏంటమ్మా కాజల్?
X
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. అందరికంటే అందం ఉన్నా కూడా కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా ఎదగలేకపోతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ మెల్లగా సెకండ్ హీరోయిన్ గా దర్శనం ఇస్తున్నారు.

అయితే కాజల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు కావొస్తున్నా లీడ్ హీరోయిన్ గానే ఛాన్సులను దక్కించుకుంటోంది. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో అమ్మడు స్క్రిన్ షేర్ చేసుకుంది. అయితే కెరీర్ లో ఈ మధ్య అమ్మడికి హీరోయిన్ గా ఛాన్సులు బాగానే వస్తున్నా ఆమె క్యారక్టర్లో మాత్రం ఇంపార్టెన్స్ ఉండడం లేదు అంటున్నారు అభిమానులు అండ్ విమర్శకులు. గతంలో ఎక్కువగా ఫ్యామిలీ - లవ్ స్టోరీస్ లో నటిస్తే సినిమాలో మెయిన్ లీడ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువగా గుర్తింపు లేని పాత్రలనే చెస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో తప్పితే అమ్మడు ఇటీవల నటించిన చాలా సినిమాల్లో హీరోతో ఓ పాటలో చిందులు వేయడానికే సరిపోయింది. మొన్న వివగం ఇప్పుడు విజయ్ మెర్సల్ లో కూడా చందమామకు సాదారణ హీరోయిన్ గానే అవకాశం దక్కింది. పాటల్లో మెరవడం తప్పిస్తే.. సినిమాలో ఈమె రోల్ కు అంత సీనే లేదు. కొద్దోగొప్పో నిత్యా మీనన్ అండ్ సమంత రోల్స్ కాస్త బెటర్. అవతల నయనతారు వంటి బ్యూటీలు చాలా ముఖ్యమైన పాత్రలు చేస్తుంటే.. కాజల్ మరి ఇలాంటి రోల్స్ పిక్ చేసుకుంటోంది ఏంటో.