కాజల్ జిలేబీ పిక్...ఫొటో వైరల్!

Sun Jun 24 2018 15:41:39 GMT+0530 (IST)

తెరపైన హీరోయిన్లు అందంగా - నాజూగ్గా - ఆకర్షణీయంగా కనిపించడానికి......తెర వెనుక నానా తిప్పలు పడుతుంటారు. అందుకోసం తమ పర్సనల్ లైఫ్ తో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకొని `డైటింగ్` చేస్తుంటారు. ఇక తీపి పదార్థాలు - కొవ్వు పదార్థాలకు....దాదాపుగా ఆమడ దూరంలో ఉంటారు. చిన్నప్పుడు స్వీట్లను ప్రాణప్రదంగా ఇష్టపడే వారు కూడా లావైపోతామనే బెంగతో....నోరు కట్టేసుకొని కూర్చుంటారు. చేతినిండా డబ్బున్నా....కోరుకున్న స్వీటు కళ్లముందు కనిపిస్తున్నా తినలేని దయనీయస్థితి వారిది. `అహనా పెళ్లంట`లో కోటా శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి ఉత్త అన్నం తింటూ చికెన్ తిన్నట్లు ఫీల్ అయిన తరహాలో....వీరు కూడా స్వీట్లను చూస్తూ చప్పిడన్నం లాగిస్తుంటారు. ఇటువంటి `స్వీట్` లెస్ లైఫ్ ను గడిపేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్  హఠాత్తుగా ఓ స్వీట్ షాప్ లో ప్రత్యక్షమైంది.ఇంకేముంది - కళ్లముందు నోరూరించే వేడి జిలేబీ కనిపించడంతో ఆబగా లాగించేందుకు రెడీ అయింది. జన్మకో శివరాత్రి తరహాలో ....కళ్లముందు జిలేబీ కదలాడడంతో ఆ షాపులో ఉన్న మొత్తం జిలేబీని ఒక్క గుటకలో స్వాహా చేద్దామని అనకొండలా నోరు తెరిచింది. జిలేబీకి మొహం వాచిపోయి కక్కుర్తిపడుతోన్న ఫొటోను కాజల్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత్ లోని మిఠాయి దుకాణంలో పనిచేసే వారి పరిస్థితి ఇలానే ఉంటుంది....అని ఆ ఫొటోకు కామెంట్ పెట్టింది. జిలేబీని చూడడమే కాదు తినండి అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. కాజల్ జిలేబీ తినబోతున్నపుడు ఆ షాపు యజమాని లుక్స్ పై కూడా కాజల్ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ప్రస్తుతం కాజల్ జిలేబీ పిక్  సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వీట్ షాప్ లో స్వీట్ గరల్ అంటూ కాజల్ పై ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఆ జిలేబీ మొత్తాన్ని కాజల్ తింటుందేమో అని షాపు యజమాని భయపడుతున్నట్లు లుక్ ఇచ్చాడని సెటైర్లు వేస్తున్నారు.