Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల‌లో అత‌న్ని ఒక్క‌సారే క‌లిసింద‌ట‌

By:  Tupaki Desk   |   23 March 2018 5:02 AM GMT
ప‌దేళ్ల‌లో అత‌న్ని ఒక్క‌సారే క‌లిసింద‌ట‌
X
హీరోయిన్ల‌కు ఉండే ప‌రిమిత‌ల‌కు అతీతం కాజల్‌. సినిమా సినిమాకు రెట్టింపు సొగ‌సుతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కు తిరుగులేద‌న్నట్లుగా ఉండే ఈ ముద్దుగుమ్మ న‌టించిన తాజా చిత్రం ఎంఎల్ఏ. క‌ల్యాణ్ రామ్ తో జ‌త క‌ట్టిన ఈ చంద‌మామ ఏ విష‌య‌మైనా ఓపెన్ గా మాట్లాడేస్తుంద‌న్న పేరుంది.

ఇదే ఆమెకు కొన్నిసార్లు ఇబ్బందుల‌కు గురి చేయ‌టం వేరే విష‌యం. దెబ్బలు తిన్న‌ప్పుడే రాటు తేల‌తార‌న్న చందంగా .. త‌న మాట‌ల‌తో త‌న‌ను తొక్కేయాల‌న్న ప్ర‌తిసారీ ఆమె త‌న టాలెంట్ తో త‌న స్థానాన్ని కాపాడుకుంటూ వ‌చ్చింది. గ‌తంతో పోలిస్తే అవ‌కాశాలు కాసిన్ని త‌గ్గినా.. ఆమె ఇండ‌స్ట్రీ చూసిన‌ప్పుడు ఇప్పుడామె చేతిలో ఉన్న సినిమాలు చూసిన‌ప్పుడు ఆమె బిజీ అనే చెప్పాలి.

ఒక్క సినిమా చేసి చ‌దువుకోవ‌టానికి వెళ్లిపోదామ‌న్న ఆలోచ‌న‌తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లుగా కాజ‌ల్ చెప్పింది. ఆమె మొద‌టి సినిమా ల‌క్ష్మీ క‌ళ్యాణం. అందులో హీరో క‌ల్యాణ్ రామ్‌. మ‌ళ్లీ ఇదే జంట‌.. ప‌దేళ్ల త‌ర్వాత క‌లిసి న‌టించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న మొద‌టి సినిమా హీరో అయిన క‌ల్యాణ్ రామ్ తో మూవీ చేసిన త‌ర్వాత.. గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఒక్క‌సారి మాత్ర‌మే క‌లిసిన‌ట్లుగా కాజ‌ల్ చెప్పింది. ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితాలతో.. సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో క‌ల‌వ‌టం సాధ్యం కాలేద‌ని చెప్పింది. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే విష‌యంలో కాజ‌ల్ కు స‌రిసాటి మ‌రెవ‌రూ ఉండ‌ర‌న్న విష‌యాన్ని తాజా మాట‌ల‌తో మ‌రోసారి ఫ్రూవ్ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.