Begin typing your search above and press return to search.

చిరు 150లో కాజల్: ఆ మీడియాకు చెప్పిందా?

By:  Tupaki Desk   |   30 July 2016 5:24 AM GMT
చిరు 150లో కాజల్: ఆ మీడియాకు చెప్పిందా?
X
ఇప్పుడు మరోసారి కాజల్ అగర్వాల్ హాట్ టాపిక్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమలో అమ్మడు హీరోయిన్ గా కన్ఫామ్‌ అయ్యిందని న్యూస్ వస్తోంది. ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థ కాజల్‌ ను ఈ విషయంపై సంప్రదిస్తే.. ఆమె ఏదో క్లారిటీ ఇచ్చిందట. అందుకే ఇప్పుడు మరోసారి కాజల్ పేరు తెరమీదకు వచ్చింది.

మొన్ననే విక్రమ్ గరుడ సినిమాలో కాజల్ చేయట్లేదని వార్తలొచ్చాయి. ఈ విషయంపై కనుక్కుంటే.. ''మరి చిరంజీవి సార్ సినిమా ఆఫర్‌ వచ్చింది కదా.. ఇది సైన్ చేశాను. అందుకే అది వదులుకున్నాను. ఆగస్టు నుండే షూటింగ్‌. ఇంకాస్త ఫిట్నెస్ పై దృష్టి పెట్టాను. త్వరలోనే షూటింగులో జాయిన్ అవ్వాలి'' అంటూ చెప్పిందని.. ఒక మీడియాలో ఈరోజు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇక రెమ్యూనరేషన్‌ గురించి కనుక్కుంటే.. ''రూమర్లలో వచ్చినదంతా నిజం కాదు. అసలు నా రేంజ్ బట్టి నేను డిమాండ్ చేస్తే ఇస్తారు కాని.. నోటికొచ్చినంత అడిగితే ఎవరన్నా ఇస్తారా? పైగా చరణ్‌ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తన సొంత ప్రొడక్షన్ ఇది. గొంతెమ్మ కోర్కెలు ఎలా కోరతాను చెప్పండి?'' అందట కాజల్.

ప్రస్తుతానికి ఈ విషయంపై ఇదే కాజల్ కాని.. రామ్ చరణ్‌ కాని.. అఫీషియల్ గా తమ సోషల్ నెట్వర్కుల ద్వారా ఎటువంటి కామెంట్ చేయలేదు. అది సంగతి.