Begin typing your search above and press return to search.

కాజల్ చేతిలో ఇంకొక్కటే ఉంది

By:  Tupaki Desk   |   21 March 2018 11:30 PM GMT
కాజల్ చేతిలో ఇంకొక్కటే ఉంది
X
ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. కాకపోతే ఈ విషయం ఇంకా టాలీవుడ్ చందమామ కాజల్ కు పెద్దగా తెలిసినట్లు లేదు. ఆఫర్లు తగ్గుతున్నాయి అన్న సమయంలో ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ పడటంతో కెరీర్ బాగా బూస్ట్ అందుకుంది. కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తగ్గిపోతున్నట్టు ఉంది.

కాజల్ చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమి లేవు. ఈమె హీరోయిన్ గా కళ్యాణ్ రామ్ పక్కన నటించిన ఎం.ఎల్.ఏ సినిమా త్వరలో తెరకెక్కనుంది. ఇంకా షూటింగ్ మొదలవ్వాల్సిన సినిమాలు ఏమి కాజల్ చేతిలో లేవు. మొన్నటికి మొన్న వెంకటేష్ - తేజ సినిమా ఆఫర్ వస్తే కాదనుకుని. నిన్న నాగార్జున పక్కన నటించమంటే కుదరదు అంది. ఎందుకు అంటే ఈమె అడిగే రెమ్యూనరేషన్ ఆ రేంజులో ఉంది మరి. వాళ్ళు ఇవ్వలేం అన్నారు. ఈమె కుదరదు అనేసింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ కాజల్ ని కలిసి తన సినిమాలో హీరోయిన్ గా చేయమని అడిగాడట.

ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధం అనేయ్యడంతో ఇంకా ఈమె ప్రాజెక్ట్ మీద సైన్ చెయ్యడం ఒకటే ఆలస్యం. అంటే చేతిలో ఇప్పుడు కేవలం ఒక్క సినిమానే ఉంది మన కాజల్ కి. అది కూడా స్టార్ హీరో పక్కన కాదు. మరి ఈ సమయంలో ఆమె కెరీర్ ఎలా పుంజుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి.