అప్పుడు కలరియపట్టు.. ఇప్పుడు మేకప్ టెస్టు!

Mon Feb 11 2019 17:24:12 GMT+0530 (IST)

పదిహేనేళ్ళు.  కాజల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్ళయింది. ఇప్పటికి ఎన్నో సార్లు కాజల్ ఫేడ్ అవుట్ అయిందని అన్నారు కానీ ఒక్కసారి కూడా అలా అన్నవారి అంచనాలను నిజం చేయలేదు ఈ టాలీవుడ్ చందమామ. ఎప్పుడు ఫేడ్ అవుట్ వార్తలు జోరుగా వస్తాయో సరిగ్గా అదే సమయంలో ఒక క్రేజీ ప్రాజెక్టును పట్టేసి వారికే కాకుండా అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది.  ఈమధ్యే 'భారతీయడు-2' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ సంపాదించి అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది.ఈ సినిమాలో కాజల్ పాత్ర గురించి ఇంకా వివరాలేమీ వెల్లడి కాలేదు గానీ కాజల్ రీసెంట్ గా మేకప్ టెస్ట్ కు మాత్రం హాజరు కావలిసి వచ్చిందట.  దర్శకుడు శంకర్ ఈ సినిమాకోసం హాలీవుడ్ మేకప్ నిపుణులతో వర్క్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే.  వారు కాజల్ కు మేకప్ టెస్ట్ చేయడం జరిగిందట.  కానీ మేకప్ టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ ఫైనలైజ్ చేశారు అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.  ఒకవేళ కాజల్ డిఫరెంట్ గెటప్.. లుక్ కనుక ఫైనలైజ్ చేస్తే అది అందరినీ షాక్ కు గురిచేయడం మాత్రం ఖాయం. ఎందుకంటే దాదాపు కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఒకే లుక్ మెయింటెయిన్ చేస్తోంది. అడపాదడపా హెయిర్ స్టైల్ మార్చడం తప్ప తన లుక్ లో భారీ మార్పులేం లేవు. మరి ఈ సారి కాజల్ కోసం దర్శకుడు శంకర్ ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేసి ఉండొచ్చు.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం కాజల్ కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరియపట్టుకు సంబంధించిన పుస్తకం చదువుతున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. అప్పుడే కాజల్ కలరియపట్టు ట్రైనింగ్ తీసుకుంటోందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు చూస్తే మేకప్ టెస్ట్.. ఏదో జరుగుతోంది.. కాజల్ ఏదో సర్ ప్రయిజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.