Begin typing your search above and press return to search.

పవన్ పక్కన కొత్తకొత్తగా కాజల్

By:  Tupaki Desk   |   26 Nov 2015 3:30 PM GMT
పవన్ పక్కన కొత్తకొత్తగా కాజల్
X
కెమేరా ముందు కనిపించడమంటే.. ఎప్పుడూ థ్రిల్ గానే ఉంటుంది. అది కెరీర్ కొత్తలో అయినా.. పదేళ్ల తర్వాతయినా అదే థ్రిల్ కంటిన్యూ అవుతుంది. ఏదో చేశాంలే చూశాంలే అనే బాపతు కూడా ఉన్నా.. కొంతమంది మాత్రం ఎప్పటికీ తమను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా అంతే. ఈ చక్కనైన చిన్నది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చిందేయబోతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో తన ఫస్ట్ షాట్ ఇదే అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేసింది కాజల్. సాంప్రదాయమైన కట్టుబొట్టుతో భలే చూడముచ్చటగా ఉంది సర్దార్ చందమామ. వీటికి తోడు మెరూన్ కలర్ టాప్ కూడా అట్రాక్టివ్ గా ఉంది. అన్నింటికంటే ఆకట్టుకునే విషయం, మెడలో నాలుగు పేటల గొలుసు. ఇంత భారీ ఆర్నమెంట్స్ తో అంటే.. అమ్మడి కేరక్టర్ ఖచ్చితంగా ఓ సాంప్రదాయాల పాటించే కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి రోల్ అని అర్ధమవుతోంది.

ఇలాంటి ఎథ్నిక్ వేర్ లో కాజల్ భలే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెకు మాత్రమే అద్భుతంగా నప్పుతాయి. ఇక ఇప్పటికైతే టాలీవుడ్ లో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఛాన్సులు దక్కించుకుంది కాజల్. పవన్ సర్దార్ తోపాటు.. మహేష్ బ్రహ్మోత్సవంలోనూ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఇలా ఒకేసారి ఈ ఇద్దరు టాప్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చిన ఏకైక హీరోయిన్ కాజల్ ఒక్కతే